తైలం తయారీ విధానం : కలబంద గుజ్జు 100 గ్రా. గుంటగలగరాకు రసం 100 గ్రా, నల్ల నువ్వుల నూనె లేక మేలు రకమైన కొబ్బరినూనె 300 గ్రా.లు తీసుకొని అన్నీ కలిపి మెత్తగా పిసిరి గుజ్జులాగా చేసి చిన్న మంటపైన నూనె మాత్రమే మిగిలేటట్లు మరగబెట్టాలి. పొయ్యిమీ నుంచి దించటానికి పావు గంట ముందు 100 గ్రా.ల గంధకచ్చూరాల పొడి వేసి తరువాత దించుకోవాలి. పధార్థమంతా చల్లబడిన తరువాత పలుచటి బట్టలో వడపోసుకొని నిలువ వుంచుకోవాలి. వాడే విధానం : ఈ తైలాన్ని కుటుంబ సభ్యులంతా ప్రతిరోజూ తగినంత మోతాదుగా తల వెంట్రుకల కుదుళ్లకు ఇంకేటట్లుగా మృదువుగా మర్థన చేసుకోవాలి. ఇలా చేస్తూ వుంటే ఎంత కాలం మంచి తగ్గకుండా పీడిస్తున్న తల దురద, తలలో పుండ్లు, తలలో జిడ్డు, తల మంట మొదలైన సమస్యలు అతి త్వరగా తగ్గిపోయి క్రమంగా వెంట్రుకలకు మంచి బలము, మంచి రంగు సంక్రమిస్తాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: