జాండీస్ (కామెర్లు) అనేది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వచ్చే అతి ప్రమాదకరమైన జబ్బు. జాండీస్ (కామెర్లు) సరైన సమయంలో గుర్తించక పోతే చాలా ప్రమాదం జరుగుతుంది. కామెర్ల లక్షణాలు తెలియగానే వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల సులభంగా తగ్గించుకోవచ్చు. జాండీస్ కి ఎక్కువ ఆయుర్వేదిక చికిత్సలు, నాటు చికిత్సలు చేయిస్తుంటారు. ఈ పచ్చకామెర్లు ఎక్కువ జ్వరం వచ్చినపుడు..ఫాస్ట్ ఫుడ్ తినని వాళ్ళు, కాఫీలు, టీ , కాఫీ, మద్యం సేవించే వారికి వెంటనే వచ్చే ప్రమాదం ఉంటుంది.

ప్రస్తుతం వైద్య విధానం లో మార్పుల కారణంగా ట్రీట్మెంట్ ప్రమాణాలు పెరిగాయి. సహజ సిద్ధమైన మన రోజువారి ఆహారం తో ఈ కామెర్లను తగ్గించవచ్చు. ఆల్కాహాల్ లేదా కాఫీ, టీ ఎక్కువగా తీసుకోవడం వలన దాని ప్రభావం లివర్ మీద పడి ఈ కామెర్ల వ్యాధి వస్తుంది.

జాండీస్ (కామెర్లు):- 


ఈ క్రింద చిట్కాలు కామెర్లు వ్యాధి రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు:

బార్లీ :- రోజుకు కనీసం 3 గ్లాసుల బార్లీ నీళ్ళు త్రాగితే జాండీస్ తగ్గిపోతుంది.

చెరకు రసం :- శుభ్రమైన చెరుకు రసం జీర్ణవ్యవస్థను , కాలేయ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. ఆ చెరుకు రసం లో కొద్దిగా నిమ్మ రసం కలిపితే ఇంకా మంచిది.

బొప్పాయి ఆకులు-: బొప్పాయి ఆకులను మెత్తగా రుబ్బి ఒక టీ స్పూన్ పేస్ట్ కు మరొక టీ స్పూన్ తేనె ను కలిపి ఒక వారం పది రోజుల పాటు తీసుకోవాలి. ఇలా చేస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.

తులసి ఆకులు :- రోజుకు 10 నుండి 15 ఆకుల తులసి ని తీసుకుని మెత్తగా చేసి ఒక అర గ్లాస్ బీట్ రూట్ రసం లో వేసుకుని త్రాగితే త్వరగా కోలుకుంటారు. అంతే కాదు కిడ్నీ లో రాళ్ళు ఉన్నా బీట్ రూట్ రసం రాళ్ళను కరిగిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది.

టమేటో జ్యూస్:- టమోటో ను మిక్సీ లో వేసి జ్య్యూస్ లాగా చేసి దానికి ఉప్పు, మిరియాల పొడి కలిపి ఉదయాన్నే త్రాగాలి.

పసుపు:- ముత్యమంత పసుపును గోరు వెచ్చని నీటిలో వేసి ఉదయాన్నే ఖాళీ కడుపుతో రోజూ త్రాగాలి, పసుపు ఆంటి బయాటిక్, కడుపులో ఉన్న క్రిములను అంతం చేస్తుంది.

మజ్జిగ :- రోజు కు 4 గ్లాసుల మజ్జిగ తీసుకోవాలి, అందులో అల్లం కొంచెం మిర్యాల పొడి కలుపు కుని త్రాగాలి.

క్యారెట్ జ్యూస్: క్యారెట్ జ్యూస్ కూడా ఎంతో ఉపయుక్తమైనది.

మరింత సమాచారం తెలుసుకోండి: