థైరాయిడ్ గ్రంథి అదనపు లేదా తక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు హైపర్ థైరాయిడిజం లేదా హైపో థైరాయిడిజం అని పిలువబడే థైరాయిడ్ రుగ్మతలు సంభవిస్తాయి. థైరాయిడ్ సమస్యల నిశ్శబ్ద సంకేతాల గురించిన వివరాలను ఈ ఆర్టికల్ వివరిస్తుంది.  థైరాయిడ్ గ్రంథి, టి4(థైరాక్సిన్), టి3(ట్రియోడోథైరోనిన్) మరియు శరీరంలో కాల్షియం నిల్వలను నియంత్రించడానికి సహాయపడే కాల్సిటోనిన్ అని పిలువబడే మరొక హార్మోన్ను కూడా ఉత్పత్తి చేస్తుంది.

Image result for tairad

ఈ హార్మోన్లు శరీరంలోని జీవక్రియలను ప్రభావితం చేస్తాయి. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరించడానికి, థైరాయిడ్ గ్రంధిని ఉత్తేజపరిచే హార్మోన్లను పిట్యూటరీ గ్రంధి(మెదడు యొక్క బేస్ వద్ద ఉన్న చిన్న అవయవము) విడుదల చేస్తుంది.

థైరాయిడ్ గురించి తక్కువగా తెలిసిన వాస్తవాలు:
పిట్యుటరీ గ్రంథి, థైరాయిడ్ క్రియాశీల పనులలో ప్రధానపాత్ర పోషిస్తుంది. అడ్రినల్ గ్రంధికి సంబంధించిన కొన్ని పనులు కూడా థైరాయిడ్ హార్మోనుల ఉత్పత్తిలో ప్రధానపాత్ర పోషిస్తుంది.

పురుషులకన్నా థైరాయిడ్ సమస్యలు మహిళలకు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

అయోడిన్, టి3 మరియు టి4 హార్మోన్ల ఉత్పత్తికి ప్రధాన అవసరంగా ఉంటుంది. అయోడిన్ లోపం థైరాయిడ్ సమస్యలకు దారితీస్తుంది.

థైరాయిడ్ గ్రంధిని ప్రభావితంచేసే కారకాలలో ప్రధానమైన కారకం ఒత్తిడి.

థైరాయిడ్ యొక్క అనేక అసాధారణతలు మెనోపాజ్ ముందు మరియు గర్భధారణ సమయంలో కనిపిస్తాయి. గర్భధారణ మీద ప్రధానంగా ప్రభావాలను కలిగి ఉంటాయి.
Image result for tairad
థైరాయిడ్ డిజార్డర్స్ కారణాలు ఏమిటి?
దీర్ఘకాలిక లింఫోసైటిక్ థైరాయిడైటిస్ లేదా ఆటోఇమ్యూన్ థైరాయిడైటిస్ అని పిలువబడే ఈ సమస్యను హాషిమోటొ థైరాయిడైటిస్ అని కూడా వ్యవహరిస్తారు.ఇది, హైపో థైరాయిడిజం యొక్క అతిసాధారణ కారకంగా ఉంది. అయోడిన్ తక్కువ మోతాదులో తీసుకుంటున్న ఎడల, అయోడిన్ లోపం కారణంగా హైపోథైరాయిడిజం సంభవిస్తుంది.

ఆరోగ్యకరమైన థైరాయిడ్ గ్రంధి యొక్క విధులు ఏమిటి?
1.ప్రోటీన్ సంశ్లేషణను ప్రేరేపిస్తుంది.
2.సాధారణ శరీర ఉష్ణోగ్రతని కాపాడుతుంది.
3.అన్ని కణాలలో బాడీ-మెటబాలిక్-రేట్(ప్రాథమిక జీవక్రియ రేటు) పెరుగడంలో సహాయపడుతుంది.
4.రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
5.శక్తి ఉత్పత్తి కోసం గ్లూకోజ్ మరియు కొవ్వుల వినియోగాన్ని పెంచుతుంది.
6.శరీరం పెరుగుదలలో ప్రధానపాత్ర పోషిస్తుంది.
7.అడ్రినలిన్ మరియు నోరాడ్రెనలిన్ ప్రభావాలను పెంచుతుంది.
Image result for tairad
థైరాయిడ్ సమస్య యొక్క ప్రధానమైన 12 నిశ్శబ్ద సంకేతాలు:

1. విచారం మరియు డిప్రెస్డ్(తీవ్రమైన ఒత్తిడి) ఫీలింగ్
థైరాయిడ్ యొక్క నిశ్శబ్ద సంకేతాలలో ఒకటి నెర్వస్ ఫీల్. ఎక్కువగా ఒత్తిడికి లోనైనభావన, విచారం ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. మెదడు తీవ్రమైన ఉద్దీపనకు లోనైన సమయంలో ముఖ్యంగా ఇలా జరుగుతుంది. ముఖ్యంగా మీకు నచ్చని అంశాలను ఎదుర్కొంటున్న సమయంలో ఆవేశానికి లోనవడం వంటి సమస్యలను ఎదుర్కోవడం తరచుగా జరుగుతుంది.

2. మలబద్దకం
తరచుగా మలబద్ధకాన్ని ఎదుర్కోవడం మరొక నిశ్శబ్ద సంకేతం. థైరాయిడ్ హార్మోన్లు మీ జీర్ణాశయాన్ని సరిగ్గా పనిచేసేలా సహాయపడుతాయి. థైరాయిడ్ గ్రంధి హార్మోనుల అసమతౌల్యం, మరియు జీర్ణక్రియలను అస్తవ్యస్త పోకడలకు గురిచేయవచ్చు. క్రమంగా జీర్ణాశయ పనితీరు మందగించి, మలబద్దక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి
Image result for tairad
3. అతినిద్ర
పగటిపూట అలసిపోవడము, తరచుగా నిద్రపోవడం అనేది థైరాయిడ్ సమస్య ప్రాధమిక గుర్తుగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథులు శరీరానికి శక్తిని అందించే థైరాయిడ్ హార్మోన్లను సరైన మోతాదులో ఉత్పత్తి చేయలేక పోయినప్పుడు, నిస్తేజానికి లోనవడం మూలంగా అతినిద్ర సమస్యలు కలుగుతుంటాయి.

4. జుట్టు నష్టం మరియు పొడి చర్మం
అధిక జుట్టు నష్టం, ముఖ్యంగా కనుబొమ్మల మీద ప్రభావం కలిగి ఉండడం, థైరాయిడ్ రుగ్మత యొక్క చిహ్నం. మితిమీరిన లేదా క్రియారహితమైన థైరాయిడ్ గ్రంధి మీ జుట్టు పెరుగుదల మీద తీవ్రప్రభావాన్ని చూపుతుంది. థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత, సాధారణంగా జుట్టు సన్నబడటానికి ప్రధాన కారకం.

5. ఆకస్మికంగా బరువు పెరుగుట
థైరాయిడ్ హార్మోన్ల కొరత జీవక్రియలను తగ్గించడమే కాకుండా, కాలరీలను తక్కువగా కరిగించేలా చేస్తుంది, క్రమంగా శరీరంలో కొవ్వు పేరుకుని పోవుట, ఊబకాయానికి గురికావడం వంటి సమస్యలు కలుగుతుంటాయి.
Image result for tairad
6. లైంగిక అనాసక్తి
ఒక క్రియారహిత థైరాయిడ్ గ్రంధి లైంగిక అసమర్థత వంటి సమస్యలకు ప్రధాన కారణంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలలో ఈ సమస్య అధికంగా కనిపిస్తూ ఉంటుంది.

7. కండరాల నొప్పి లేదా కండరాలు గట్టి పడడం
కండరాల నొప్పి లేదా కండరాల బలహీనత ఒక థైరాయిడ్ గ్రంధి హార్మోనుల అసమతౌల్యం మూలాన కూడా సంభవించవచ్చన్న విషయం అనేకమందికి అవగాహన లేదు. థైరాయిడ్ సమస్యలు ఉన్న ప్రజలు కండరాలు గడ్డిపడడం, తీవ్రమైన నొప్పులను ఎదుర్కోవడం వంటి సమస్యలకు గురవుతుంటారు.

8. గుండె దడ
థైరాయిడ్ హార్మోన్ల యొక్క అధిక ఉత్పత్తి గుండె దడ, ఛాతీ నొప్పి మరియు గుండె వైఫల్యానికి కూడా కారణమవుతుంది.

9. నిష్క్రియాత్మకమైన మెదడు
మెదడు పూర్తిగా నిస్తేజానికి గురైన అనుభూతికి అన్నివేళలా మెదడు కారణం కాకపోవచ్చు, ఒక్కోసారి ఇది థైరాయిడ్ సమస్య కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిష్క్రియాత్మక మెదడు నేస్తేజాన్ని, అలసటను, అతినిద్రను కలిగించడమే కాకుండా, ఆలోచనా శక్తి కూడా మందగించేలా చేస్తుంది

10. అధిక రక్తపోటు
అధిక రక్తపోటు, థైరాయిడ్ డిజార్డర్ యొక్క మరొక లక్షణంగా ఉంది. దీనికి కారణం ధైరాయిడ్ గ్రంధి హార్మోనుల అసమతౌల్యం, జీవక్రియల మీద ప్రభావం చూపడం కారణంగా జరుగుతుంది. క్రమంగా అవిశ్రాంతత, తీవ్రమైన చమట, నిస్సత్తువ వంటి లక్షణాలను ఎదుర్కొనవలసి ఉంటుంది.

11. మెడ లేదా గొంతు అసౌకర్యం
మెడ లేదా గొంతు అసౌకర్యం, ముఖ్యంగా వాపు, సున్నితత్వం, మెడభాగం గట్టిపడడం లేదా గొంతులో నిండిన అనుభూతికి లోనవడం మొదలైనవి లక్షణాలుగా కనిపిస్తాయి. థైరాయిడ్ గ్రంధి కణాలు క్రమంగా పెరగడం మూలంగా ఈ సమస్య కలుగుతుంది, క్రమంగా ఆహారం మింగడంలో కూడా సమస్యలను ఎదుర్కొనవలసి రావొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: