థైరాయిడ్ హార్మోన్ ప్రభావం అన్ని జీవ వ్యవస్థల ఎదుగుదల, కార్బొహైడ్రేట్ కొవ్వు పదార్థాల జీవ వ్యవస్థ, బీఎంఆర్, శ్వాస, గుండె, నాడీ , జీర్ణ, సంతాన ఉత్పత్తి వ్యవస్థలపై ఉంటుంది.   థైరాయిడ్ గ్రంధి గొంతు భాగంలో థైరాయిడ్ కార్టిలేజ్ అనే మృదులాస్థిపైన ఉంటుంది. ఈ గ్రంధిలో మార్పుల వల్ల హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ సమస్యలు వస్తుంటాయి.

Image result for tairad

కారణాలు :
 జీవన విధానంలో మార్పులు, అధిక ఒత్తిడి, కొరవడిన వ్యాయామం, పోష్టికాహారలోపం వల్ల థైరాయిడ్ బారిన పడతారు. వంశపారంపర్యంగా సమస్యలు, అయోడీన్ లోపం, పిట్యూటరీ గ్రంధిలో వచ్చే వ్యాధుల వల్ల థైరాయిడ్ సమస్యలు వస్తుంటాయి.

హైపోథైరాయిడిజం:
శరీరంలో కావాల్సిన దానికంటే తక్కువ మోతాదులో థైరాయిడ్ గ్రంధి థైరాక్సిన్ ఉత్పత్తి చేయడం వల్ల వస్తుంది. పిల్లలు, సీ్త్రలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

లక్షణాలు :
పిల్లల్లో బుద్దిమాంద్యం, ఎదుగుదల లోపం, జ్ఞాపకశక్తి లేకపోవటం, మలబద్ధకం, చురుకుదనం కోల్పోవటం, వయసుకు మించి లావుగా ఉండటం.
యుక్తవయసువారిలో : ఒంట్లో నీరు చేరి బరువు పెరగటం, బీఎంఆర్ తగ్గిపోయి రజస్వల ఆలస్యం కావటం, రుతుచక్రం ఆలస్యం కావటం, నెలసరిలో అధిక రక్తస్రావం, తక్కువ రక్తస్రావం కావడం, సంతానలేమి, చ ర్మం పొడిబారటం, వెంట్రుకలు రాలడం, బద్ధకంగా ఉండి పనిచేయాలని అనిపించక పోవడం, చలిని తట్టుకోలేక పోవడం, ఆడవారిలో రోజూ వేసుకునే దుస్తులు, గాజులు బిగుతు కావడం, అర్టికేరియా చర్మ సంబంధ వ్యాధుల లక్షణాలతో హైపో థైరాయిడ్ను గుర్తించవచ్చు.
Image result for tairad
హైపర్ థైరాయిడిజం:
థైరాయిడ్ గ్రంధి ఎక్కువ మోతాదులో థైరాక్సిన్ను విడుదల చేయడం వల్ల వచ్చే సమస్యను హైపర్ థైరాయిడిజం అంటారు.

లక్షణాలు: ఆహారం సరైన మోతాదులో తీసుకున్నా బరువు తగ్గడం, గుండెదడ, అధిక చెమటలు, విరేచనాలు, చేతులు వణకడం, నీరసంగా ఉండటం, నెలసరి త్వరగా రావడం, రుతుచక్రంలో అధిక రక్తస్రావం జరగటం.

హషిమోటోస్ థైరాయిడైటిస్ : ఇది జీవనక్రియల అసమతుల్యత వల్ల వచ్చే థైరాయిడ్ సమస్య. థైరాయిడ్ గ్రంధికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ఉత్పన్నం అయి ఈ గ్రంధిని సరిగా పనిచేయనియ్యవు.

గాయిటర్ :
 థైరాయిడ్ గ్రంధి వాపునకు గురవటాన్ని గాయిటర్ అంటారు. పరిమాణం పెరిగి స్వరపేటికపైన ఒత్తిడి చేయడం వల్ల వాయిస్లో మార్పు వస్తుంది. అయోడీన్ లోపం వల్ల ఈ వ్యాధి వస్తుంది. స్వరంలో మార్పులు రావటం, గొంతుకింద వాపు, కనుగుడ్లు బయటకు పొడుచుకు వచ్చినట్లుగా ఉండటం.
Image result for tairad
నిర్ధారణ పరీక్షలు : థైరాయిడ్ ప్రొఫైల్, యాంటీ థైరాయిడ్ యాంటీబాడీస్, గొంతు సీటీస్కాన్.

థైరాయిడ్ హార్మోనులు రెగ్యులేట్ చేసే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ :
శరీరంలో జీవక్రియలు ముఖ్యమైన విధులను నిర్వహించడానికి థైరాయిడ్ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్న విషయం తెలుసా? అటువంటి థైరాయిడ్ హార్మోన్స్ అసమతుల్యత వల్ల థైరాయిడ్ కు సంబంధించిన సీరియస్ వ్యాధులకు కారణమవుతుంది. థైరాయిడ్ హార్మోనులను సమతుల్యం చేయడానికి కొన్ని హోం రెమెడీస్ గొప్పగా సహాయపడుతాయి. శరీరంలో జీవక్రియలు పనిచేయాలంటే థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. అదే విధంగా, శరీరంలో థైరాయిడ్ గ్రంథి మరో ముఖ్యమైన ఎండోక్రైన్ గ్రంథి కూడా ముఖ్య పాత్రను పోషిస్తుంది.

థైరాయిడ్ గ్రంథి అనారోగ్యానికి గురైనప్పుడు, శరీరంలో జీవక్రియల మీద తీవ్రదుష్ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోతే, హార్మోనుల్లో అసమతుల్యతలు ఏర్పడుతాయి. థైరాయిడ్ కు సంబంధించిన రెండు రకాల వ్యాధులు ఎదుర్కోవల్సి వస్తుంది. థైరాయిడ్ గ్రంథులు ఇన్ యాక్టివ్ గా ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం , మరియు థైరాయిడిజం గ్రంథులు ఓవరాక్టివ్ గా ఉన్నప్పుడు హైపర్ థైరాయిడిజం సమస్యలు వస్తాయి.

థైరాయిడ్ కు సంబంధించిన వ్యాధుల యొక్క లక్షణాలు, ఆందోళన, ఎక్కువగా చెమటలు పట్టడం, వాసన గ్రహించలేకపోవడం, బరువు పెరగడం, సెడెన్ గా బరువు తగ్గడం, అలసట, తరచూ మానసికంగా మార్పులు, డిప్రెషన్ వంటివి ఎదుర్కోవల్సి వస్తుంది. అందువల్ల థైరాయిడ్ గ్రంథులు ఆరోగ్యకరంగా ఉంచుకోవడం చాలా అవసరం. హెల్తీ థైరాయిడ్ గ్రంథుల కోసం కొన్ని ప్రత్యేకమైన చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే.థైరాయిడ్ హార్మోన్స్ ను సమతుల్యం చేసుకోవడానికి హోం రెమెడీస్ ను ఎలా తయారుచేయాలి.ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం... 

కావల్సినవి: అల్లం జ్యూస్ : 1టేబుల్ స్పూన్ 
క్రాన్ బెర్రీ జ్యూస్: 1/2కప్పు 
ఆరెంజ్ జ్యూస్ : 1/2కప్పు
నిమ్మరసం : 1టీస్పూన్
తయారీ: ఒక గ్లాసులో పైన సూచించిన విధంగా పదార్థాలన్నింటిని తీసుకోవాలి. స్పూన్ తో మొత్తం బాగా మిక్స్ చేయాలి. అంతే హెల్తీ థైరాయిడ్ డ్రింక్ తాగడానికి రెడీగా ఉంది. ఈ హెల్త్ డ్రింక్ తయారుచేయడానికి పంచదార, ఇతర ఫ్లేవరింగ్ ఏజెంట్స్ జోడించకూడదు. ఈ హెల్త్ డ్రింక్ ను ప్రతి రోజూ ఉదయం పరగడపున ఒక నెలరోజుల పాటు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


ఈ రిసిపి థైరాయిడ్ హార్మోన్స్ ను సమతుల్యం చేస్తుంది. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.  శరీరానికి నేచురల్ డిటాక్సిపైయర్ గా పనిచేస్తుంది., శరీరంలో టాక్సిన్స్ ను బయటకు నెట్టేస్తుంది. శరీరంలో మలినాలు లేకుండా చేస్తుంది. థైరాయిడ్ గ్రంథులు నార్మల్ గా పనిచేయడానికి ఇవి చాలా అవసరం. అదనంగా ,ఈ హోం మేడ్ రిసిపిలో థైరాయిడ్ హార్మోన్స్ ను హెల్తీగా ఉత్పత్తి అవ్వడాన్ని ప్రోత్సహిస్తుంది.  ముఖ్యంగా హెల్తీ డైట్ ను ఫాలో అయినప్పుడు, రెగ్యులర్ వ్యాయమం వల్ల థైరాయిడ్ సమస్యలను నివారించుకోవచ్చు


మరింత సమాచారం తెలుసుకోండి: