రీసెంట్ గా జరిపిన కొన్ని పరిశోధనలలో పురుషుల కంటే మహిళలు చాలా త్వరగా మరణిస్తారని నిర్ధారిస్తున్నారు. ఎందుకంటే వీరిలో 8 రకాల వ్యాధులు చాలా త్వరగా మరణానికి కారణం అవుతున్నాయని వెల్లడి చేస్తున్నారు . ప్రపంచంలో 2 మిలియన్స్ కంటే ఎక్కువగా బ్రెస్ట్ మరియు ఓవేరియన్ క్యాన్సర్ తో పోరాడుతున్నారు . ఇందులో అతి భయంకరమైన విషయం ఏంటేంట, గత కొంత కాలం నుండి మహిళలు ఎక్కువగా డయాబెటిస్ కు గురి అవుతున్నారు . ఇది ప్రాణాంతకంగా మారుతున్నది, అనీమియా కూడా మరణానికి కారణం అవుతున్నది . 

Image result for women's health problems

ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధులతో పోరాడాలన్నా...మరికొంత కాలం జీవించాలన్నా అనేక ట్రీట్మెంట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి . అయితే కొన్ని విషయాల్లో, హోం రెమెడీస్ కూడా సహాయపడుతాయి . అయితే హోం రెమెడీస్ , వ్యాధులు ప్రారం దశలో కనుగొన్నప్పుడు ఉపయోగించడం వల్ల కొంత వరకూ నివారించుకోవచ్చు. కాబట్టి మహిళలు , నెలకొకసారి వైద్యులను సంప్రదించి మెడికల్ టెస్ట్ లు , ఓవరాల్ హెల్త్ చెకప్స్ చేయించుకోవడం మంచిది. ఇలాంటి మెడికల్ విజిట్స్ వల్ల ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడకుండా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుటకు సహాయపడుతుంది . కాబట్టి, లేడీస్ మీరు ఇప్పటికే 25ఏళ్ళు దాటిన వారైనా సరే మీ హెల్తీ లైఫ్ ను హరించివేసుకోకుండా...కొన్ని నిముషాలు మీ గురించి మీ ఆరోగ్యం కోసం సమయాన్ని కేటాయించండి. మరి మహిళల్లో ప్రాణాంతకంగా మారే కొన్ని వ్యాధులు ఈ క్రింది విధంగా.... 


1.హార్ట్ డిసీజ్: మహిళల్లో 38శాతం మంది మొదటి హార్ట్ అటాక్ సమయంలోనే మరణిస్తున్నట్లు పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి. మహిళల్లో ఎవరైతే స్మోక్ చేస్తారో, అలాంటి వారిలో హార్ట్ లో బ్లాక్స్ ఏర్పడి హార్ట్ అటాక్ మరియు హార్ట్ డిసీజ్ కు కారణం అవుతున్నాయి 

2.బ్రెస్ట్ కాన్సర్: మహిళల్లో 35సంవత్సరాల తర్వాత మోమోగ్రామ్ టెస్ట్ ను చేయించుకోవాలి . ఇది బ్రెస్ట్ హెల్తీగా ఉందా లేదా అన్న విషయాన్ని తెలుపుతుంది .23ఏళ్ళతర్వాత ప్రతి ఒక్క మహిళ సెల్ఫ్ చెకప్ చేసుకోవడం చాలా అవసరం. ఇలా సెల్ఫ్ చెప్ వల్ల బ్రెస్ట్ లో అసాధారణ కణతులు గుర్తించినట్లైతే ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కు ప్రారంభ చిహ్నాంగా గుర్గించాలి. 

3. సర్వైకల్ క్యాన్సర్: స్కర్విక్స్ లో ని కణాల్లో క్యాన్సర్ ఏర్పడుతుంది . మహిళలు మల్టిపుల్ సెక్స్యువల్ సంబంధాల్ని కలిగి ఉండటం వల్ల ఇలా క్యాన్సర్ డెవలప్ మెంట్ కు కారణం అవుతుంది. దీనికి ఎలాంటి లక్షణాలుండవు. క్యాన్సర్ పూర్తిగా ఫార్మ్ అయిన తర్వాత లక్షణాలు కనబడుతాయి 

4.ఓబేరియన్ క్యాన్సర్: ఓవేరియన్ క్యాన్సర్ ఓవరీస్ లో వస్తుంది . మహిళల్లో వచ్చే అత్యంత ముఖ్యమైన క్యాన్సర్ ఇది . ప్రపంచంలో కొన్ని మిలియన్ల సంఖ్యలో ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు . ఓవేరియన్ క్యాన్సర్ కు ప్రారంభ చిహ్నాలేవీ లేవు . 

5. డిప్రెషన్: సోషియల్ సిగ్మా వల్ల , చాలా మంది మహిళలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు . అందుకు కారణం డిప్రెషన్ మరియు వర్క్ ఫీల్డ్ లో నిస్సహాయస్థితి మరియు మరియు ఇంట్లో మరియు బయట డామినేటెడ్ పరిస్థతులు అందుకు కారణం అవుతాయి.

 6.డయాబెటిస్: మహిళల్లో 28ఏళ్ల తర్వాత టైప్ 2 డయాబెటిస్ చాలా సాధరణమైపోయింది . ఎవరైతే ఆరోగ్యకరమైన మరియు జీవనశైలిని బ్యాలెన్స్ చేయలేకపోతారో అలాంటి వారు ఈ డయాబెటిస్ కు కారకులవుతారు .
 
7.కిడ్నీ సమస్యలు: హైబ్లడ్ ప్రెజర్, హార్ట్ సమస్యలు, మరియు ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నాయి , మహిళల్లో ఒకరకమైన కిడ్నీ వ్యాధులు ఉంటాయి . కిడ్నీ వ్యాధి ప్రారంభ లక్షణాలు, బ్లీక్, యూరిన్ మరియు బ్లడ్ టెస్ట్ వల్ల తెలుసుకోవచ్చు.

8.అనీమియా: ప్రతి ముగ్గురిలో ఒకరు ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉండటం. లేదా ఉండాల్సిన బరువు కంటే అధికంగా ఉండటం వల్ల అనీమియాకు కారణం అవుతుంది. ఈ హెల్త్ సమస్య వల్ల గర్భధారణ సమయంలో స్టిల్ బర్త్స్, బ్రెయిన్ డ్యామేజ్, పిల్లల్లో చాలా నిర్జీవమైన ఫీటల్ డెవలప్ మెంట్ కు కారణం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: