వైద్యవిఙ్జానం అపారంగా విస్తరిస్తున్నా ఎన్నోసమస్యలకు పరిష్కారందొరకట్లేదు. ఇటునుంచి వీలు కాకపోతే అటునుంచి నరుక్కురమ్మన్నారు అనేది తెలుగు నానుడి. యాంటీబయాటిక్‌ మెడిసిన్స్ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఉన్న మందులకు అలవాటు పడిన బ్యాక్టీరియా ఒక పట్టాన చావనంటున్నాయి. కొత్తఔషధాల తయారీకి బ్రేకులు పడిపోయాయి. 
Image result for cefiderocol
దీంతో శాస్త్రవేత్తలు రూటు మార్చేశారు. ఇటు నుంచి కాకపోవటంతో అటు నుంచి  నియంత్రించే సరికొత్త మందును సిద్ధం చేశారు! యాంటీబయాటిక్‌ నిరోధకత ఈ మధ్యకాలంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో అతిపెద్దది అనడంలో సందేహం లేదు.  అంతెందుకు దీని కారణంగా 2050 నాటికి కోటి మంది ప్రాణాలు కోల్పోతారు అనే పరిస్థితి. తీవ్రత ఏమిటన్నది దీంతో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో జపాన్‌ ఫార్మా సంస్థ షియొనోగి ఒక శుభవార్తను తీసుకొచ్చింది. సెఫీడెరొకాల్‌ పేరుతో ఈ సంస్థ అభివృద్ధి చేసిన సరికొత్త యాంటీబయాటిక్‌ మొండి బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.  
Image result for cefiderocol
Cefiderocol - The latest miracle drug?


సెఫీడెరొకాల్‌  ఈ కొత్త మందు ప్రత్యేకత ఏంటి? ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే మనం జబ్బుపడ్డప్పుడు శరీరంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఏదైనా ఇన్ఫెక్షన్‌ సోకినప్పుడు ముందుగా మన రోగనిరోధక వ్యవస్థ రంగంలోకి దిగుతుంది. ఇది రకరకాల పద్ధతుల్లో జరుగుతూ ఉంటుంది.  శరీరంలోని ఇనుము మోతాదును తగ్గించడం ఇందులో ఒకటి.  రోగ నిరోధక వ్యవస్థ ఈ చర్యకు దిగిన వెంటనే బ్యాక్టీరియా కూడా స్పందిస్తుంది. అందుబాటు లోని ఇనుమును వేగంగా తీసుకోవడం మొదలు పెడుతుంది. 

Image result for cefiderocol

షియొనోగి శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని సెఫీడెరొకాల్‌ ను సిద్ధంచేశారు. ఇనుము అణువుల లోపల యాంటీబయాటిక్‌ మందును చేర్చారు. బ్యాక్టీరియా ఈ అణువులను లోపలికి చేర్చుకోగానే, సెఫీడెరొకాల్‌ పని మొదలుపెడుతుంది. లోపలి నుంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. గ్రీకుపురాణాల్లో చెప్పినట్లు చెక్కగుర్రాల లోపల యోధులను ఉంచి, ట్రాయ్‌ నగరంపై దండెత్తినట్లు అన్నమాట!
Image result for cefiderocol

షియొనోగి ఇటీవలే సెఫీడెరోకాల్‌ను 448 మందిపై ప్రయోగించి చూశారు. మూత్రపిండాల, మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారిపై ఈ మందు ప్రయోగించగా దాదాపు 73% మంది స్పందించారని (73% సక్సెస్‌.), ప్రస్తుత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న శక్తిమంతమైన యాంటీ బయాటిక్‌ కంటే ఇది చాలా ఎక్కువని షియొనొగి తెలిపింది. 
Image result for cefiderocol
దాదాపు 15 దేశాలు, 67 ఆసుపత్రుల్లో జరిగిన ప్రయోగాలు సత్ఫలితాలిచ్చినప్పటికీ విస్తృతస్థాయిలో ప్రయోగాలు జరిగితేగానీ, ఈ మందును అందుబాటులోకి తేలేమన్నది నిపుణుల మాట. సెఫీడెరొకాల్‌ లాంటి వినూత్న మందులు మరిన్ని అభివృద్ధి చేస్తే యాంటీబయాటిక్‌ నిరోధకతకు మెరుగైన పరిష్కారం లభిస్తుందని వీరు అంటున్నారు. 
Image result for cefiderocol
• అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ సుమారు 90 ఏళ్ల క్రితం పెన్సిలిన్‌ రూపంలో తొలి యాంటీ బయాటిక్‌ను తయారు చేశారు.
• పెన్సిలిన్‌ లాంటి యాంటీ బయాటిక్‌ కూ లొంగని బ్యాక్టీరియా ఏటా 7 లక్షల మంది ప్రాణాలు తీస్తోంది.
• అవసరం లేకపోయినా యాంటీబయాటిక్‌లు వాడాలని సూచిస్తున్నది. మొత్తం ప్రిస్క్రిప్షన్లలో 20%
• అవసరానికి మించి వాడటం వంటి కారణాలతో ఏ మందుకూ లొంగని సూపర్‌-బగ్‌లు ఎక్కువ అవుతున్నాయి.
• ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కల ప్రకారం, 12 రకాల బ్యాక్టీరియాలతో మనిషికి ముప్పు ఎక్కువ!
• గత 30 ఏళ్లలో మార్కెట్‌ లోకి వచ్చిన యాంటీ బయాటిక్‌ లన్నీ పాతవాటిలో మార్పులు, చేర్పులు చేసి సిద్ధం చేసినవే! 

Image result for cefiderocol

మరింత సమాచారం తెలుసుకోండి: