Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 27, 2019 | Last Updated 1:09 pm IST

Menu &Sections

Search

అల్లం టీ రోజూ తాగితే అమృతమా? విషమా?

అల్లం టీ రోజూ తాగితే అమృతమా? విషమా?
అల్లం టీ రోజూ తాగితే అమృతమా? విషమా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వాతావరణంలో మార్పులు, అదీ ఆకశ్మిక మార్పులు, అకాలంలో అప్పుడప్పుడూ కురిసే వర్షాల వలన జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమస్యల నుండి విముక్తి చెందుటకు అల్లం టీ చక్కని ఔషధంగా ఉపయోగపడుతుంది. మరి ఈ అల్లం టీ లో గల ప్రయోజనాలను తెలుసుకుందాం.

 

అల్లం టీ లో విటమిన్ సి, మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఈ అల్లం టీ ని ఎలా చేయాలో చూద్దాం. కప్పు నీటిలో కొద్దిగా అల్లం తరుగు, టీ పొడి వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఆ తరువాత వడకట్టుకుని అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. 

health-news-ginger-tea-anti-accidents-resistence-m 

పాలతో చేసుకునే టీ లో కూడా కొద్దిగా అల్లం ముక్కను వేసుకుని వడకట్టి తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధశక్తిని పెంచుటలో చక్కగా పనిచేస్తుంది. అంతే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. 

 

అల్లంలో ఉండే ఖనిజాలు, అమినోయాసిడ్స్ రక్తప్రసరణ సక్రమంగా జరుగేలా చేస్తాయి. శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. తద్వారా అధికబరువు తగ్గుతారు. మహిళలకు నెలసరి సమస్యలో వచ్చే నొప్పులు కూడా తొలగిపోతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. 

 

ఆయుర్వేద ప్ర‌కారం అల్లంలో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. అల్లంను నిత్యం మ‌నం కూర‌ల్లో వేస్తుంటాం. దీంతో కూర‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే రుచికే కాదు, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందివ్వ‌డంలోనూ అల్లం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ క్ర‌మంలోనే అల్లంతో టీ త‌యారు చేసుకుని నిత్యం తాగితే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

health-news-ginger-tea-anti-accidents-resistence-m
1. అల్లం టీని తాగి ప్ర‌యాణాలు చేస్తే వాంతులు రాకుండా ఉంటాయి. కొంద‌రికి కార్లు, బ‌స్సుల్లో ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు వాంతులు అవుతుంటాయి. అలాంటి వారు ప్ర‌యాణానికి ముందు అల్లం టీ తాగితే ఫ‌లితం ఉంటుంది. 

2. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాకుండా స‌మ‌స్య‌లు ఎదుర్కొనేవారు అల్లం టీని తాగితే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. 

3. కీళ్ల నొప్పులు ఉన్న‌వారు అల్లం టీ తాగితే ఆ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

4. అల్లం టీని రోజూ తాగితే ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. హైబీపీ త‌గ్గుతుంది. 

5. రుతుక్ర‌మం స‌రిగ్గా ఉండ‌ని మ‌హిళ‌లు అల్లం టీ తాగితే ఉత్త‌మం. అలాగే శ‌రీర రోగ నిరోధ శ‌క్తి కూడా అల్లం టీతో పెరుగుతుంది. 

6. బాగా త‌ల‌నొప్పిగా ఉంటే అల్లం టీ తాగితే వెంట‌నే నొప్పి త‌గ్గిపోతుంది. 

7. అల్లం టీని నిత్యం తాగుతుంటే అధిక బ‌రువు, కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. 

health-news-ginger-tea-anti-accidents-resistence-m

health-news-ginger-tea-anti-accidents-resistence-m
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అప్పులు ₹250000 కోట్లకు చేరాయి! ఏపి ప్రస్తుతం అప్పుల కుప్ప
చంద్రబాబుపై జగన్ తొలి అస్త్రం ఏమిటో తెలుసా? తెలుసుకోండి!
తెదేపా పతనానికి నాడే పడ్డ పునాదులు - ఇక జగన్ జనం నమ్మకం నిలుపుతారనే నమ్ముదాం!
టిడిపి కుటుంబ ప్యాకేజీలకు వారసులకు వైసిపి సునామిదెబ్బ
జగన్ ప్రభుత్వం: సీఎస్‌గా ఎల్వీ సుబ్రమణ్యం - సలహాదారుగా అజయ్ కల్లాం
నందమూరి కుటుంబానికి ఇంకొంత గౌరవం ఉన్నట్లే ఉంది-నారా కుటుంబం తుడిచిపెట్టుకు పోయింది
అవినీతి అక్రమాలే చంద్రబాబును టిడిపిని నిట్టనిలువుగా ముంచేశాయి
తాజెడ్డ కోతి వనమెల్ల చెరచు అన్నట్లు బాబు తనతో పాటు కాంగ్రెస్ నూ చెరిచారు!
కర్ణాటకలో దెవెగౌడ ఖేల్ ఖతం: రాజకీయాల నుండి గెంటేశారా!
కౌగిలించుకొని కాంగ్రెస్ కొంప ముంచాడు నవజ్యోత్ సింగ్ సిద్దు! కెప్టెన్ అమరిందర్ సింగ్
బ్రేకింగ్ న్యూస్ : రాహుల్ గాంధిని ఆల్ టైమ్ రికార్డుతో గెలిపించిన దక్షిణాది - ఉత్తరాది తన్నేసిందా!
కేసీఆర్! రాష్ట్ర పాలన సరిగా చూడు! దేశం సంగతి మేం చూసుకుంటాం! తెలంగాణా జనం
మట్టిలో మాణిక్యం టీఅరెస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు!  బామ్మర్ధి కేటీఆర్ ఖేల్ ఖతం!
ఏపిలో వైసీపికి లాండ్ స్లైడ్ విజయం-దేశమంతా బీజేపి నిశ్శబ్ధ విప్లవం-చంద్రబాబుకు చరమగీతం
వారసుల గోల ఎక్జిట్-పోల్స్ లీల! ముఖ్యమంత్రుల తనయులు కర్ణాటక - ఏపిలో ఓడిపోవడం గ్యారెంటీ!
అబద్ధం (అసత్యం) చెప్పవచ్చట – ఆ సందర్భాలు ఏవంటే!
“ఎన్నికల రిగ్గింగ్‌ లో సుప్రీం కోర్టు ప్రమేయం ఉందేమో?”  కాంగ్రెసోళ్ళు ఇంతకు తెగించారు!
చంద్రబాబుకు షాక్: రేపటితో కర్ణాటకంలో కుమార ప్రభుత్వం పతనమేనా?
 "ఓటేసిన వేటు దెబ్బ" చంద్రబాబుకు తెలిసే సుదినం రేపే! దిమ్మతిరిగి బొమ్మ కనిపించేనా!
About the author