అందమైన పలువరుస ఎంతో అందంగా ఉంటుంది. అయితే పలువరుస అందంగా ఉన్నా, పళ్ళు పచ్చగా గార పట్టి ఉంటే నలుగురిలో హాయిగా నవ్వలేము. అందుకే, ఎప్పుడూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. మార్కెట్లో అమ్మే దంతవర్థిని, టూత్ పౌడర్లు, పేస్టలతో పాటు దంతక్షయానికి మన పూర్వీకులు ఉపయోగించిన వేపపుల్లలు, గానుక పుల్లలను కూడా వాడితే తెల్లని పళ్ళు సొంతమవుతాయి. అంతేకాదు వేపపుల్లలతో పళ్ళు తోముకోవడం వల్ల చిగుళ్ళు గట్టిపడి దంతాలు థృఢంగా మారతాయి. ఎంత సేపు తోమినా పళ్ళ మీద ఉన్న ఎనామిల్ అరిగిపోదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: