చాలా కాలంగా పెరుగును భారతీయులు తమ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడానికి కారణం దాని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనా. వేస‌విలో మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్ని ఇచ్చే ఆహార ప‌దార్థాల్లో పెరుగు కూడా ఒక‌టి. పెరుగును వేస‌విలో తింటే మ‌న‌కు ఎంతో లాభం క‌లుగుతుంది. ముఖ్యంగా శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి. ప‌లు అనారోగ్య స‌మస్య‌లు కూడా త‌గ్గుతాయి. 
Related image
ప్రతిరోజూ లేదా తరచుగా మనం పెరుగును అన్నంతో కలిపి తినడం వలన మీ జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయటమే కాక మీ సంపూర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెరుగన్నం దక్షిణ భారత దేశంలో పుట్టినప్పటికి అది కేవలం దక్షిణ భారతదేశానికి మాత్రమే పరిమితమవ్వలేదు. ఉత్తర భారతంలో కూడా ఇది చాలా ప్రఖ్యాతి గాంచింది.  ముఖ్యంగా వేసవిలో. కడుపులో అసౌకర్యంగా ఉన్నవారు సాధారణంగా పెరుగన్నం తింటారు. ఆరోగ్యాన్ని మెరుగు పరచేందుకు పెరుగన్నం చాలా అవసరం అంటారు పెద్దలు. పెరుగు శరీరానికి చల్లదనం చేకూర్చే పోషకాహారం కనుక ప్రతి ఒక్కరు తమ డైట్ ప్లాన్ లో చేర్చుకోవాలి. 
Image result for curd images
ఈ క్ర‌మంలోనే పెరుగును ఈ సీజ‌న్‌ లో రోజూ తింటే మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1 కడుపు ఉబ్బరంను నివారిస్తుంది కనుక అజీర్తి, కడుపు లో మంట మొదలైన సమస్యలు ఉన్నప్పుడు పెరుగన్నం తినడమే ఉత్తమమైన గృహవైద్యం. పెరుగన్నం జీర్ణకారి గా పేరుగాంచింది.పెరుగును రోజూ తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మస్య‌లు ఉండ‌వు. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. క‌డుపులో మంట త‌గ్గుతుంది.  

2. పెరుగన్నాన్ని చల్లగానే తినడం ఉత్తమం. ఇది దేహాన్ని చల్లబరచి సరైన శరీర అంతర్గత ఉష్ణోగ్రతను ఉండేటట్లు చేస్తుంది. కనుక జ్వరాలు ఉన్నప్పుడు కూడా దీనిని నిరభ్యంతరంగా తినవచ్చు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పెరుగన్నం తింటే శరీరాన్ని త్వరగా వేడెక్కనివ్వదు. 

3. పెరుగులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రో-బయోటిక్స్ మరియు మంచి కొవ్వులు ఉంటాయి. కనుక పెరుగు తినడం వలన ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఇది మెదడుకు బాధలు, నొప్పులను తగ్గించడంలో తోడ్పడుతుంది. 

4. బరువు కోల్పోవాలని అనుకునేవారు కనీసం రోజులో ఒక్కపూటైనా పెరుగన్నం తినాలనుకుంటారు. ఒక గిన్నెడు పెరుగన్నం తింటే కడుపు నిండిన భావన కలిగి అధిక కెలోరీలు ఉండే చిరుతిళ్ళను తినరు. ఫ్రైడ్-రైస్ తో పోలిస్తే పెరుగన్నంలో కెలోరీలు చాలా తక్కువ ఉంటాయి. 
Image result for curd images
5. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక అనారోగ్యంతో బాధపడుతున్నపుడు పెరుగన్నం తినడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అనారోగ్య సమయంలో శరీరానికి అవసరమైన శక్తిని పంపిణీ చేస్తుంది.

6. పెరుగు తినడం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. 

7. క్యాన్స‌ర్ల‌ను అడ్డుకునే శ‌క్తి పెరుగు లోని ఔష‌ధ పదార్ధాలకు ఉంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. 

8. పసి పిల్లలు కూడా తినవచ్చు. దీనిలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు అధికంగా ఉండటంతో శరీరానికి అవసరమైన పోషణ లభిస్తుంది. ఎముకలు బలవర్ధక మౌతాయి  

9. కారంగా ఉండే ఆహార పదార్థాలు తిన్న తరువాత పెరుగన్నం తింటే కడుపు మండటం, చికాకు నుండి ఉపశమనం లభిస్తుంది. కనుక ఏవైనా వేపుళ్ళు లేదా కారంతో కూడిన వంటలు తిన్నాక పెరుగన్నం తినడం మంచిది. 

10. పెరుగు చర్మానికి శిరోజాలకు బలవర్ధకమైన పోషణ తో పాటు కాంతివంతంగా మారుస్తుందని పేరు పొందింది. కనుక దీన్ని ఫేస్ ప్యాకులలో కూడా వాడవచ్చు .

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: