ఎన్ టి ఆర్ వైద్య సేవ...  ఇకపై వై ఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ గా పిలవబడుతుంది
వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష

ఎన్ టి ఆర్ వైద్య సేవ...  ఇకపై వై ఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ గా పిలవబడుతుంది. ఇదే ఆరోగ్య పథకం మాజీ  ముఖ్యమంత్రి దివంగత వై ఎస్ రేజశేఖర్ రెడ్డి కి  కాంగ్రెస్ పార్టీ పై అభిమానం, కేంద్రంలో ఆ పార్టీ అప్పట్లో అధికారం ఉండడంతో  రాజీవ్ గాంధీ పేరుతో ఆరోగ్య శ్రీ పధకాన్ని ప్రారంభించారు. రాజశేఖర్ రెడ్డి అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టి డి పీ అధికారంలోనికి రావడంతో రాజీవ్ ఆరోగ్య శ్రీ పధకం కాస్తా ఎన్ టి ఆర్ వైద్య సేవగా మారింది. తాజాగా  వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావడంతో ఆ పధకం పేరు మరోసారి మార్చబడింది. ఇకపై వై ఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ గా ప్రభుత్వ , ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్య సేవలు అందించనున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి సమీక్షించారు. 
 
వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమగ్ర సమీక్ష చేపట్టారు. వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమైయ్యారు. ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచి మంచి ఫలితాలు సాధించే విధంగా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అందరికి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించనున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వం వైద్యం కూడా అందాలని అధికారులకు సీఎం ఆదేశించనున్నారు. ఇప్పటికే నివేదికలు తయారుచేసిన ఇరుశాఖల అధికారులు వాటిని సీఎంకు సమర్పించనున్నారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పథకాలను రూపొందించాలని ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే.


రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖకు పెద్ద పీఠ వేస్తామని వైఎస్‌ జగన్‌ అనేక సందర్భాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈమేరకు ప్రజలకు ఉచిత వైద్యంపై కసరత్తు చేయనున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా తీర్చి సిద్ధేందుకు  అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టవలసిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యాద్య సేవలతో పాటు , పలు రకాల వ్యాద్య పార్తీకాసల  విధానాలపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారుడు అజయ్‌ కల్లాం, వైద్య శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: