అవకాడో.. మెక్సికో వంటి దేశాల్లో ఎక్కువగా పండుతుంది.  మనదగ్గర దీని వాడకం తక్కువ.  ధర ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనిని పెద్ద పెద్ద రెస్టారెంట్ లలో విరివిగా వినియోగిస్తున్నారు.  అవకాడోను వారంలో కనీసం రెండు సార్లు తీసుకుంటే ఆరోగ్యం చాలా బావుంటుంది.  ఇందులో బి విటమిన్ అధికంగా ఉంటుంది కాబట్టి బి విటమిన్ లోపం వలన కలిగే వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు.  


అవకాడోలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.  అవకాడోను తీసుకోవడం వలన బరువు తగ్గొచ్చు.  అలాగే ఊబకాయం వంటి వ్యాధుల నుంచి బయటపడేందుకు అవకాడో ఎంతగానో ఉపయోగపడుతుంది.  


అవకాడోలో మోనో శ్యాచురేటేడ్ కొవ్వు ఉంటుంది.  ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేందుకు దోహదం చేస్తుంది.  ఫలితంగా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.  బిపి, షుగర్ వంటివి అదుపులో ఉంటాయి.  హృదయ సంబంధమైన వ్యాధుల నుంచి బయటపడొచ్చు.  


అవకాడోలో ఉండే ల్యూటెన్ కళ్ళకు శుక్లాలు రాకుండా కాపాడుతుంది.  కళ్లకింద మచ్చలను నివారిస్తుంది.  అంతేకాదు, ఇందులో ఏ విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది.  ఇది వృద్ధాప్య ఛాయలను తీసుకురావడాన్ని తగ్గిస్తుంది.  


అవకాడోను నిత్యం తీసుకోవడం వలన క్యాన్సర్ నుంచి బయటపడొచ్చు.  అంతేకాదు, సంతానోత్పత్తి లేమి నుంచి కూడా బయటపడొచ్చు.  అదే విధంగా రోజు అవకాడో తీసుకునే వాళ్లలో మెదడు చురుగ్గా పనిచేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: