మానవుల జీవితంలో ఎలక్ట్రానిక్ పరికరాలు మనకు తెలియకుండానే ఓ భాగమైపోయాయి.వాటి సహాయం వల్ల మనకు కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది.ప్రస్తుతం ఉన్న తరంలో జేబులో డబ్బు లెకున్నా ఫోన్ మాత్రం తప్పక ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ పరికరాల రాక వల్ల మన జీవితంలో లాభం ఎంత జరుగుతుందో నష్టం కూడా అంతే జరుగుతుంది.

మనం లాభాన్ని గుర్తించినంత త్వరగా నష్టాన్ని గుర్తించలేక పోతున్నాం అని కొందరు ప్రముఖ వైద్యలు మరియు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వారి తాజా పరిశోదన ప్రకారం ఎలక్ట్రానిక్ వస్తువులలో ముఖ్యంగా ఫోన్లు, ల్యాప్ టాప్ మరియు ట్యాబులు ఎక్కువ వాడేవారికి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ ఆక్టివిటీ డిజాడర్ వస్తుంది అని దాని వల్ల వారికి ఓపిక తక్కువగా ఉంటుందని మరియు చిన్న విషయాలకు ఎక్కువగా రియాక్ట్ అవుతుంటారని చెబుతున్నారు.

ఇది పిల్లల పై మరింత ఎక్కువగా ప్రభావం చూపుతుంది అని వారు అంటున్నారు.మితంగా వాడితే ఏదైనా శ్రేయస్కరం అదే అమితంగా వాడితే ప్రమాదం అని ఇప్పటికైన గుర్తుతెచ్చుకోని వైద్యులు చెబుతున్నట్టు ఎలక్ట్రానిక్ వినయోగన్ని తగ్గిద్దాం లేదంటే మన పరిజ్ఞానం వల్ల పుట్టుకొచ్చిన టెక్నాలజీ మనల్నే మింగేస్తుంది


మరింత సమాచారం తెలుసుకోండి: