గుడ్డు శాకాహారమా మాంసాహారము అనే దానిపై ఇప్పటికే  జాతీయ ఆరోగ్య సంస్థలు ఓ క్లారిటీ ఇచ్చాయి.  గుడ్డు శాఖాహారమనే అని ఇప్పటికే తేల్చి చెప్పాయి.  పిల్లల ఎదుగుదలకు గుడ్డు ఎంతగానో సహకరిస్తుంది.  పిల్లలకు కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేస్ ఇందులో ఉంటాయి.  


ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కింద నూనెతో ఉన్న  ఆహరం తీసుకోవడం కంటే.. గుడ్డును తీసుకోవాలని.. ఉడకబెట్టిన గుడ్డు ప్రతి ఒక్కరికి మేలు చేస్తుందని న్యూట్రీషియన్స్ చెప్తున్నారు.  రోజుకు ఎన్ని గుడ్లు తీసుకోవచ్చు అనే దానిపై  చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి.  


రోజు రెండు కంటే ఎక్కువ గుడ్లు తీసుకోకూడదు.  దీనికి కారణం ఉంది.  ఒక్కో గుడ్డులో 200 మిల్లి గ్రాముల కొవ్వు ఉంటుంది.  ఇది శరీరానికి మంచిది.  రోజుకు రెండు అంటే కొంతవరకు మంచిదే.  అంతకు మించి తీసుకుంటే.. శరీరంలో అనవసరమైన కొవ్వు పేరుకుపోతుంది. 


ఫలితంగా కొలెస్ట్రాల్... గుండె జబ్బులు సంభవిస్తాయి.  హఠాత్ మరణం సంభవించే అవకాశం కూడా ఉంటుంది.  కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండుకు మించి తీసుకోకపోవడమే ఉత్తమం.  


మరింత సమాచారం తెలుసుకోండి: