దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడినవాళ్లకు ఇంట్లో ఏదో ఒక ఆరోగ్య పరికరం అవసరం ఉంటుంది. చక్రాల కుర్చీలు, చేతికర్రలు, కమోడ్‌ కుర్చీల్లాంటివి కావాల్సి ఉంటాయి. అలాంటివాటిని చౌకగా అందించేందుకు కర్ణాటకలోని బాప్టిస్ట్‌ ఆసుపత్రి ‘మెర్సీ డ్రాప్స్‌’ పేరిట ప్రజల భాగస్వామ్యంతో కొత్త సేవను ప్రారంభించింది.


ఇందులో అవసరమైన పరికరాలను కొనుక్కోవచ్చు.. మనకు అవసరం లేని పరికరాలను ఇవ్వొచ్చు. ఆసుపత్రి పడకలు, నెబ్యులైజర్లు, స్ట్రెచర్లు, స్నానపు కుర్చీలు... ఇలా వేటినైనా స్వచ్ఛందంగా అందించొచ్చు. ఈ పరికరాల అవసరం ఉన్నవారు తక్కువ ధరకే వాటిని కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. పరికరాల్లో ఏమైన లోపాలుంటే వాటిని బాగుచేయించి ఇస్తున్నారు.


తమ ఆసుపత్రి వైద్యబృందం ఇళ్లలో చికిత్స అందిస్తున్నపుడు ఈ ఆలోచన వచ్చిందని.. కొందరు ఆరోగ్య పరికరాలు లేక ఇబ్బందులు పడుతుంటే... మరికొందరి వద్ద వినియోగంలో లేని పరికరాలను ఉన్నట్లు గుర్తించారని బాప్టిస్ట్‌ ఆసుపత్రి అసోసియేట్‌ డైరెక్టర్‌ సన్నీ కురువిల్లా తెలిపారు. ఇలాంటివి ఇప్పటివరకు 100 పరికరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని మెర్సీ డ్రాప్స్‌ నిర్వాహకులు పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: