ప్రసవం తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్  చాలా ముఖ్యం. బేబీ పెరిగే కొద్ది, తల్లులు చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. . తల్లి తీసుకునే ఆహారాల మీద తగిన జాగ్రత్తలు అవగాహన కలిగి ఉండాలి. బ్రెస్ట్ మిల్క్ ను పెంచడంలో కొన్ని ఆహారాలు బాగా సహాయపడుతాయి. కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బ్రెస్ట్ మిల్క్ పెరుగుతాయి. కొత్తగా తల్లైన వారు హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ల్యాక్టింగ్ సమస్యలుండవు. కొంత మంది మహిళల్లో బ్రెస్ట్ మిల్క్ సరిపడా ఉండకపోవడంతో బిడ్డకు పాలు సరిపోవడం లేదని ఎక్కువ ఆందోళనకు గురి అవుతుంటారు. అయితే అందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రసవం తర్వాత సరైన ఆహారాన్నిఎంపిక చేసుకుని తీసుకుంటే తల్లిలో పాలు బాగా పడుతాయి. దాంతో బేబీ పెరుగుదలకు బాగా సహాయపడుతుంది.. అయితే ప్రసవించిన తర్వాత, కొత్తగా తల్లైన వారు మొదటి తీసుకునే ఆహారాల గురించి గైనకాలజిస్ట్ ను తప్పనిసరిగా కలవాలి. బ్రెస్ట్ మిల్క్ ను పెంచే అటువంటి ఫుడ్స్ కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి. తల్లి తీసుకునే ఆహారాల గురించి డాక్టర్ సరైన సలహాలనిస్తుంటారు. బ్రెస్ట్ మిల్క్ ను పెంచే కొన్ని రకాల ఆహారాలు  ఎక్కువగా తీసుకోవాలి.


వంటలకు వాడే నూనె ఆలివ్ ఆయిల్ అయితే చాలా మంచిది.తల్లి తినే ఆహారాలకు ప్రత్యేకంగా ఆలివ్ ఆయిల్ మరియు నువ్వుల నూనెను ఎంపిక చేసుకోవాలి. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కు ఇవి చాలా మంచిది.. అయితే లిమిటెడ్ క్వాంటింటీ ఉపయోగించాలి. 
 తులసి ఆరోగ్యానికి మంచిది . తులసి ఆకులో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. కొత్తగా తల్లైనవారిలో విటమిన్ కె పాలు పడటానికి సహాయపడుతుంది మరియు ఇతర హెల్త్ బెనిఫిట్స్ ను కూడా అందిస్తుంది. ప్రతి రోజూ ఓట్ మీల్ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. లేదంటే బ్రెడ్ పాలు తీసుకోవ‌డం వ‌ల్ల కూడా ఎక్కువ‌గా పాలు ప‌డే అవ‌కాశం ఉంటుంది. బ్రెస్ట్ మిల్క్ పెంచడంలో ఇది గ్రేట్ ఫుడ్ . . ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ లో ఓట్ మీల్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లి కూడా త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. బ్రెస్ట్ మిల్క్ పెంచడంలో గార్లిక్ (వెల్లుల్లి)గ్రేట్ గా సహాయపడుతుంది. వెల్లుల్లిని వివిధ రకాల వంటల్లో జోడించాలి . బ్రెస్ట్ మిల్క్ సప్లై చేయడంలో ఇది ఒక బెస్ట్ ఫుడ్ . వెల్లుల్లి ఘాటైన వాసన ఉండటం వల్ల దీన్ని తినడానికి చాలా మంది ఇష్టపడరు , కానీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బాలింత‌ల‌కు ఎలాంటిఇన్‌ఫెక్ష‌న్స్ కూడా రాకుండా ఉంచుతుంది. 


బీట్ రూట్,క్యారెట్, మరియు స్వీట్ పొటాటో వంటి రూట్ వెజిటేబుల్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. . వీటిని సలాడ్స్ రూపంలో తీసుకోవాలి . బ్రెస్ట్ మిల్క్ ను నేచురల్ గా పెంచడానికి ఇవి బెస్ట్ ఫుడ్స్ . రూట్ వెజిటేబుల్ లో బీట్ రూట్ మరింత ఎఫెక్టివ్ వెజిటేబుల్. సోంపు పాలిచ్చే తల్లులకు చాలా హెల్తీ ఫుడ్ . ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి,కొత్తగా తల్లైన వారిలో సోంపు తప్పనిసరిగా చేర్చుకోవాలి. 


 ఫేవరెట్ నట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యానికి మాత్రమే కాదు, , పాలిచ్చే తల్లులకు చాలా ప్రయోజనాలను అందిస్తుంది. బాదం మరియు జీడిపప్పును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అయితే మితంగా తీసుకోవడం మంచిదిజ . బ్రెస్ట్ మిల్క్ ను పెంచే నేచురల్ ఫుడ్స్ లో ఇది ఒకటి. బ్రెస్ట్ మిల్క్ ను పెంచడంలో జింజర్ పేస్ట్ ఒకటి. రోజూ వండే వివిధ రకాల వంటల్లో దీన్ని ఉపయోగించడం చాలా మంచిది. . పచ్చిగా తినడం కష్టంగా ఉంటుంది కాబట్టి, పేస్ట్ రూపంలో వంటల్లో చేర్చుకోవాలి, . అల్లం పేస్ట్ వంటలకు అదరను రుచి, వాసన అందిస్తుంది. అంతకంటే ముఖ్యమైన విషయం ఎల్లప్పుడు, శరీరం హైడ్రేషన్ లో ఉంచుకోవాల: శరీరాన్ని నిరంతరం హైడ్రేషన్ లో ఉంచుకోవాలంటే తనిగినంత నీరు తాగాలి. . పాలలో 80శాతం వాటరే ఉంటుంది . కాబట్టి, తల్లైన వారు రోజు శరీరానికి సరిగా నీరు తాగడం కూడా చాలా అవసరం. అలాగే కొన్ని ఫుడ్స్ కూడా హైవాటర్ కంటెంట్ కలిగి ఉంటాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల పాలు ఉత్పత్తి అవుతాయి


మరింత సమాచారం తెలుసుకోండి: