సంకల్పం - చిత్తశుద్ధి, శరీరానికి ఆత్మలాంటిది, 'చరిత్రలో నిలిచిపోయే ఆవిష్కరణ చేయాలి', 'పరిపూర్ణ ఆరోగ్యాన్ని సాధించాలి' ... ఇలాంటివే ఇంకేవ్కెనా కావచ్చు. యోగనిద్రలో మనం ఆశించే సంకల్పం సాధ్యమైనంత 'పాజిటివ్‌'గా ఉండాలి, సాధించగలిగేదై ఉండాలి. సంక్షిప్తంగా సూటిగా ఉండాలి. కొత్త సంవత్సర తీర్మానాలు రాసుకుంటున్నప్పుడో, జీవిత భాగస్వామికో తల్లిదండ్రులకో ఫలానా పని తప్పకుండా చేస్తాననో, అస్సలు చేయననో అన్యమనస్కంగా మాటిస్తున్నప్పుడు అంతరాత్మ ప్రభావం తక్కువగా ఉంటుంది. 

బతుకు పరుగులో పడి మన శరీరాన్ని మనం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాం. తల నుంచి పాదాల దాకా శరీరంలోని ప్రతి అవయవాన్నీ పలకరించి పరామర్శించి వచ్చే అవకాశమే ఉంటే, ఎలా ఉంటుంది? మన భారాన్ని అలవోకగా మోసే పాదాలకు ఏరోజైనా కతజ్ఞత చెప్పామా, మన మొహానికో ప్రత్యేకతను తెచ్చిపెట్టిన చక్కని నాసికాన్ని ఒక్కసారైనా ప్రశంసించామా? లేదు. యోగనిద్ర మనకా అవకాశాన్ని ఇస్తుంది. ఇదో మానసికమైన పరామర్శ. కుడికాలి చిటికెనవేలు, నాలుగోవేలు, మధ్యవేలు, రెండోవేలు, బొటనవేలు ...కాలు, మోకాలు, తొడ- ఆతర్వాత ఎడమకాలి చిటికెనవేలు - ఆతర్వాత ఉదరం, ఆతర్వాత తల - ఒక్కో భాగం మీదా మనోదష్టి సారిస్తూ ముందుకు వెళ్తాం. చివర్లో మొత్తంగా శరీరం మీద! ఒక్కో మజిలీ పూర్తవుతున్నకొద్దీ... వివిధ భాగాల్లో పేరుకుపోయిన ఒత్తిడి తొలగిపోతున్న భావన కలుగుతుంది.

మెదడుకు సత్యాసత్యాలు తెలియవు. మనసు పంపే సంకేతాల్ని బట్టే స్పందిస్తుంది. రుచి అయినా, అరుచి అయినా అందమైనా అసహ్యమైనా...అంతా మన వూహే! వివిధ సందర్భాల్లో తామరాకు మీద నీటి బిందువులా స్పందించడం ఎలాగో గురువులు ఈ దశలో బోధిస్తారు. కాసేపు చుట్టూ వేడిమిని వూహించుకోమంటారు, మరికాసేపు చల్లదనాన్ని అనుభవంలోకి తెచ్చుకోమంటారు. ఉద్వేగాల మీద నియంత్రణ సాధించడానికి ఇదో యోగసంబంధమైన కసరత్తు.

సంకల్పం - చిత్తశుద్ధి, శరీరానికి ఆత్మలాంటిది, 'చరిత్రలో నిలిచిపోయే ఆవిష్కరణ చేయాలి', 'పరిపూర్ణ ఆరోగ్యాన్ని సాధించాలి' ... ఇలాంటివే ఇంకేవ్కెనా కావచ్చు. యోగనిద్రలో మనం ఆశించే సంకల్పం సాధ్యమైనంత 'పాజిటివ్‌'గా ఉండాలి, సాధించగలిగేదై ఉండాలి. సంక్షిప్తంగా సూటిగా ఉండాలి. కొత్త సంవత్సర తీర్మానాలు రాసుకుంటున్నప్పుడో, జీవిత భాగస్వామికో తల్లిదండ్రులకో ఫలానా పని తప్పకుండా చేస్తాననో, అస్సలు చేయననో అన్యమనస్కంగా మాటిస్తున్నప్పుడు అంతరాత్మ ప్రభావం తక్కువగా ఉంటుంది. 

బతుకు పరుగులో పడి మన శరీరాన్ని మనం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాం. తల నుంచి పాదాల దాకా శరీరంలోని ప్రతి అవయవాన్నీ పలకరించి పరామర్శించి వచ్చే అవకాశమే ఉంటే, ఎలా ఉంటుంది? మన భారాన్ని అలవోకగా మోసే పాదాలకు ఏరోజైనా కతజ్ఞత చెప్పామా, మన మొహానికో ప్రత్యేకతను తెచ్చిపెట్టిన చక్కని నాసికాన్ని ఒక్కసారైనా ప్రశంసించామా? లేదు. యోగనిద్ర మనకా అవకాశాన్ని ఇస్తుంది. ఇదో మానసికమైన పరామర్శ. కుడికాలి చిటికెనవేలు, నాలుగోవేలు, మధ్యవేలు, రెండోవేలు, బొటనవేలు ...కాలు, మోకాలు, తొడ- ఆతర్వాత ఎడమకాలి చిటికెనవేలు - ఆతర్వాత ఉదరం, ఆతర్వాత తల - ఒక్కో భాగం మీదా మనోదష్టి సారిస్తూ ముందుకు వెళ్తాం. చివర్లో మొత్తంగా శరీరం మీద! ఒక్కో మజిలీ పూర్తవుతున్నకొద్దీ... వివిధ భాగాల్లో పేరుకుపోయిన ఒత్తిడి తొలగిపోతున్న భావన కలుగుతుంది.

మెదడుకు సత్యాసత్యాలు తెలియవు. మనసు పంపే సంకేతాల్ని బట్టే స్పందిస్తుంది. రుచి అయినా, అరుచి అయినా అందమైనా అసహ్యమైనా...అంతా మన వూహే! వివిధ సందర్భాల్లో తామరాకు మీద నీటి బిందువులా స్పందించడం ఎలాగో గురువులు ఈ దశలో బోధిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: