ప్రతిరోజూ యోగా చేయడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని మన పూర్వికులు పురాతన కాలం నుంచి చెప్తూ వస్తున్నారు. శరీరాన్ని, మనసును అనుసంధానం చేసే ప్రక్రియ యోగ.  యోగ ప్రక్రియను నిత్యం చేయడం వలన శరీరానికి, మనసుకు ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా.. నిత్యం జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది.  

కొన్ని రకాల యోగాసనాలు చేయడం  వేయడం వలన వయసు తగ్గిపోతుంది.  శరీరంలో ముడతలు కనిపించవు. నిత్య యవ్వనంగా కనిపించేందుకు అవకాశం ఉంటుంది.  ఆ యోగాసనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.


1. మాలసాన
యోగమ్యాట్ పై నిటారుగా నిలబడండి. మెల్లిగా పాదాలు వెడం చేస్తూ, సుమారుగా రెండు కాళ్ళ మధ్య కనీసం ౩ ఫీట్ల వెడం ఉండేలా చూడండి.  ఇప్పుడు రెండు చేతులను దగ్గరికి తీసుకొస్తూ దండం పెడుతున్న పోసిషన్ లోకి తీసుకురండి. ఇప్పుడు మోకాళ్ళ దగ్గర వంచి మీ కోర్ బాగాన్ని కిందకు దించండి. వీలైనంతగా కిందకు దించండి. ఇలా ౩ నుండి 4 సెకండ్స్ ఉంచి తిరిగి సాదారణ స్థితిలోకి రండి. ఇలా 5/6 సార్లు చేయండి. ఇలా చేయడం వలన కాళ్ళ కండరాలు బలపడతాయి.  నడుము చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది. 


2. ఉత్కటాసన
ఇది శరీరంలోని వివిధ సమస్యలను సమర్దవంతంగా ఎదుర్కొంటుంది, ముఖ్యంగా పిరుదల బాగంలో ఏజ్ తో పాటు సంభవించే సాగుడను నివారిస్తుంది. యోగమ్యాట్ పై నిటారుగా నిలబడండి.  రెండు కాళ్ళను దగ్గరగా ఉంచుతూ నిటారుగా నిలబడండి. రెండు చేస్తులు దండం పెడ్తున్న పోజ్ లోకి తీసుకురండి. చేతులను తలపైకి అలాగే లేపండి. ఇప్పుడు మెల్లిగా మోకాళ్ళ దగ్గర వంచి. శరీరాన్ని కుర్చీ ఆకారంలోకి తీసుకురండి. ఇలాగె ఒక 5/6 సెకండ్లు ఉంది తిరిగి మొదటి పోసిషన్ లోకి రండి.  దిన్ని ౩/4 పునరావృత్తం చేయండి.  దీనివలన శరీరం నాజూగ్గా మారుతుంది.  


3. చతురంగాసన
ఈ ఆసనం  శరీరం లో జారిపోతున్న పటుత్వాన్ని తిరిగి నింపుతుంది.  ఒక ర కంగా ఇది ప్లాంక్ లాంటి పొజిషన్ గాచెప్పుకోవచ్చు. కాని కొంచం నిదానంగా శ్వాశ ను గమనిస్తూ చేస్తే ఎక్కువగా ప్రభావాతం చేస్తుంది. బోర్ల పడుకొని అరి చేతులపై బలం వేస్తూ బాడి ని నేలపై లేపండి. పాదాల చివరల్ని నేలపై ఉంచుతూ శరీరాన్నివిల్లులా ఒక లైన్ లో ఉంచుతూ శ్వాసను బిగపట్టి బరువుననంత పొట్టపై తీసుకోండి. ఇలా 3/4 సెకండ్స్ ఉంచి తిరిగి మొదటి పొజిషన్ లోకి రండి.  మొదట్లో ఈ ఆసనం చేయడం కొంచం కష్టంగా ఉంటుంది. క్రమం తప్పకుండా చేయడం వలన ఈ ఆసనం వేయడం ఈజీ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: