సంపూర్ణ ఆరోగ్యానికి , ఒక ప్రణాళికా బద్దమైన జీవన విధానం చాలా ముఖ్యం.
దినసరి జీవన శైలి 
1, తెల్లవారు జామున 4- 5 గంటల మధ్య సూర్యోదయం కాక ముందే నిద్రలేవడం వల్ల మెదడులొ పిట్యూటరీ గ్లాండ్స్‌ చురుకుగా వుండి మన శరీరం ఆ రోజు చేయవలసిన పనులను జాగృతం చేస్తుంది.
2, చిరునవ్వుతో ఈ రోజంతా నేను ఆనందంగా గడుపుతాను అనుకోవాలి.
3, మంచంపైనే ఒక్క నిముషం ఉండి, దీర్ఘంగా శ్వాస తీసుకొని ,ఒక పక్కకు తిరిగి మెల్లగా లేవాలి. భూమాతకు నమస్కరించి క్రిందకుదిగి ,దుప్పట్లు ,దిండు సరిచేసుకోవాలి.

4, మొఖం కడుక్కోని వేడినీళ్ళతో గార్లింగ్‌ చేయాలి.
5, గోరు వెచ్చని నీటిలో తేనె ,నిమ్మరసం,సబ్జాగింజలు కలుపుకొని తాగాలి.
6, ఉదయపు నడక 30 నిమిషాలు,ఒక కిలో మీటర్‌ నడిస్తే మంచిది. నడిచే టప్పుడు కాళ్ళు,చేతులు బాగా చాచి ,తల ఎత్తుకొని నిటారుగా నడవాలి.
7, సూర్య నమస్కారాలు – కనీసం 12 భ్రమణాలు చేయాలి.
8, ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల లోపు ఎండలొ కనీసం 45 నిమిషాలు పాటు వుండటం వలన, శరీరానికి ఎంతో అవసరమైన డి – విటమిన్‌ అందుతుంది.

9, వేడి నీటితో స్నానం మంచిది. మనం వాడే సబ్బులు, షాంపూలు, పౌడర్లు వలన రకకకాల కెమికల్స్‌ మన శరీరంలొకి నేరుగా ప్రవేశించి కొన్ని వ్యాధులకు కారణమవుతున్నాయి.
సున్నిపిండి, కుంకుళ్ళు,షీకాయ మొదలగు సాంప్రదాయ పద్దతులను పాటించడం ఆరోగ్యానికి మంచిది.
10,  కనీసం 20 నిముషాలు మీ ఇష్ఠదైవాన్ని పూజించాలి. పూజ మనసుని ప్రక్షాళన చేస్తుంది.మీకు ఆ రోజంతా భగవంతుని ఆశీస్సులుంటాయనే ధైర్యం వుంటుంది. మంచి భావనతో ప్రారంభ మయ్యే రోజు ఆహ్లాదంగా వుంటుంది.

11,  నీరు జీవనాధారం. గోరు వెచ్చని నీరు, అవసరమైన మేరకే తాగాలి. భోజనం చేసేటప్పుడు కేవలం నోరు తడుపుకోవడానికి తీసుకోవాలి. తిన్న తరువాత 30 నిమిషాలు వరకు నీరు త్రాగరాదు. నీటిని కేవలం స్టీలు బాటిల్స్‌ ,గ్లాసులలొ మాత్రమే త్రాగాలి. ప్లాస్టిక్‌ బాటిల్స్‌ వాడకూడదు. మినరల్‌ వాటర్‌ ను అసలు త్రాగవద్దు. అందులో శరీరానికి కావలసిన లవణాలు ఏమి వుండవు. మినరల్‌ వాటర్‌కి ప్రత్యామ్నాయం లేకపోతే, ఆ నీటిలో కొంచెం సైందవ లవణం, కొంచెం పసుపు కలిపి తాగలి. సుమారుగా రోజుకు 3 నుండి 4 లీటర్ల వరకు తీసుకోవచ్చు.
12,  మొలకెత్తిన పెసర్లు,దానిమ్మ గింజలు ,నల్లని ఎండు ద్రాక్ష(30 నిమిషాలు నీళ్ళలో నానబెట్టినవి), అంజూరా,రాత్రిపూటనానపెట్టిన బాదం గింజలు వీటిని బాగా కలుపుకొని ఇంట్లో అందరూ 4 చెంచాలు చొప్పున బాగా నమిలి తినాలి.ఇది మీకు కావలసిన ప్రొటీన్‌ ఓమేగా ప్యాటి యాసిడ్‌ ,ఎంజైములు,యాంటీ ఆక్సిడింట్స్‌ అందిస్తాయి.రాగి జావ ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మహిళల్లో రక్త హీనత నివారణకు రాగి జావ ప్రతి రోజు కనీసం 1 గ్లాస్‌ త్రాగాలి.రాగి జావ తయారీ : రాగుల్ని సుద్ది చేసి మొలకెత్తించాలి. వాటిని నీడలో ఆరబెట్టి ,కిలోకి 100 గ్రాముల చొప్పున సగ్గుబియ్యం ,బార్లి గింజలు కలిపి మర పట్టించుకోవాలి. వేడిగా కాచిన నీళ్లలో రాగి పిండిని కలుపుకోవాలి. ఈ జావని ఉదయం పూట మజ్జిగలో కలుపుకొని తాగాలి.  (మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం శ్రీనివాస్ గారినిసంప్రదించండి—8142445544  )



మరింత సమాచారం తెలుసుకోండి: