అమృతాహారం తయారీ:
బీటురుట్‌-1 ,(సుగర్‌ వ్యాధి వున్న వారికి వద్దు)
పుదీనా -2 కట్టలు ,కొత్తిమీర – 2 కట్టలు ,మెంతి -1కట్ట తీసుకొని బాగా కడిగి తరిగి మిక్సీ వేసి పేస్టుగా చేయాలి.వెచ్చని నీరు ,నిమ్మకాయ ,కొంచం సైంధవ లవణం కలుపుకొని రొజుకు 3 సార్లు త్రాగాలి.విహారం: మీరు అదేపనిగా కూర్చొని పనిచేయకుండా 30 నిమిషాలకు ఒక సారి లేచి అటుఇటు తిరిగి వెళ్ళి పని చేసుకోవాలి.లంచ్‌ 12 నుండి 1 గంట లోపు తీసుకుంటే మంచిది.భోజనం తయారు చేయడం అనేది భగవంతుడికి నైవేద్యం పెట్టడంతొ సమానం.భోజనాన్ని శుచిగా స్నానంచేసి అగ్నికి నమస్కరించి తినేవారందరూ, ఆనందంగా,ఆరోగ్యంగా,వుండాలని,ప్రార్దించిచేయాలి.వంటకు కేవలం స్ఠిల్‌ పాత్రలను వాడాలి. సైందవ లవణం 80 రకాల సూక్ష్మపోషకాలను కలిగి వుంటుంది .కావున సాదారణ ఉప్పుకు బదులు సైందవ లవణం వాడాలి. 

గానుగ నూనెను వంటకు వాడాలి. కారం మితంగా వాదుకోవాలి,చింతపండు పులుసు కంటే, నిమ్మకాయ వాడుకోవాలి.అన్నం కొసం చాలా తక్కువగా పాలిష్‌ బియ్యాన్ని గాని ,కొర్ర బియ్యాన్ని గాని వాడుకొవాలి. అన్నం వండే టప్పుడు గంజి వార్చాలి. రైస్‌ కుక్కర్‌ లలో ,అల్యుమినియం పాత్రలలో వంట చేయరాదు. జొన్నలు,రాగులు,సద్దలు,కొర్రలు,మెదలగు వాటిని పిండి చేయించి మల్టిగ్రేన్‌ రొట్టెలు తయారు చేసుకొవచ్చు. కూరలు ఆకుకూర పప్పు, మిక్సిడ్‌ కూరగాయలు ఆవిరి మీద  ఉడికించి తాలింపు వేసుకొని తినాలి.

పెరుగు బదులుగా జీలకర్ర మజ్జిగ వీలైనన్ని సార్లు తాగవచ్చు.భోజనం తరువాత 10 నిమిషాల నడక మంచిది. సాయంత్రం 4 గంటలకు కొన్ని పండ్లు,గ్రీన్‌ టీ తిసుకుంటే మంచిది, ప్రతి రొజు ప్రతి ఒక్కరు పైనాపిల్‌ జ్యుస్‌ 1 గ్లాస్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. రాత్రి 7 గంటలకు అల్పాహరం ,మల్టీగ్రేన్‌ రొట్టె, కూర తీసుకుంటే చాలు. తరువాత కాసేపు నడక,కుటుంబ సభ్యులతొ సంబాషణ అనంతరం 9 గంటలకు నిద్రపొవాలి.పాలు 6 సంవత్సరాలు దాటినవారు తీసుకొరాదు. పాలలొ వుండె కెసిన్‌ అనే ప్రొటిన్‌ జీర్ణం చేసే ఏంజైము 6 సంవత్సరాలు వయస్సు తరువాత వుండదు.

మానసికంగా…
 
మంచి పుస్తకాలు ,స్నేహితులు ,కుటుంబ సభ్యులతో గడపడం అవసరం,ఈ సమాజం పట్ల మనకు బాద్యత వుంది. ఈ ప్రపంచంలో చిన్న మార్పుకోసం ఐనా కృషి చేయాలి. మనకి నచ్చడం,నచ్చక పోవడంలో ప్రపంచాన్ని చూడకూడదు, జీవితం ఒక పండుగలా వుండాలి, మనం వున్న చోట సంతోషం చిందులు వేయాలి.
ప్రతి చిన్ని విషయాన్ని ఆస్వాదించాలి.శాంతి ,సహనం ,చిరునవ్వు ,మానసిక ఆనందాన్నిచ్చి, అనేక రకాల రుగ్మతలను దూరం చేసి,జీవితాన్ని సుఖమయం చేస్తాయి.( మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం శ్రీనివాస్ గారినిసంప్రదించండి 8142445544 )


మరింత సమాచారం తెలుసుకోండి: