గిరిజనుల పాలిట దేవుడు ఈ కలెక్టర్‌ !! 

ఉద్యోగం అంటే బాధ్యత. అన్నింటికంటే ఐఏఎస్‌ కొలువంటే ..ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కొండ జనం కోసం ఛత్తీస్‌ఘడ్‌ కలెక్టర్‌ చేసిన ప్రయత్నం , ఎందరికో స్ఫూర్తిని ఇచ్చింది. ఆదివాసీలు, అత్యధికంగా నివసించే మారుమూల కొండ ప్రాంతాల్లో వైద్యం అందుబాటులో ఉండదు. రహదారులు లేక ఆంబులెన్స్‌లు వారి గూడేలకు చేరుకోలేవు. నుండి చింతపల్లి వరకు ఇదే పరిస్ధితి ...

రెక్కాడితే కానీ డొక్కాడని ఆ పేదలు చికిత్స కోసం..కొన్ని మైళ్ల దూరం వెళ్లాల్సిందే. దగ్గరలో ఆస్పత్రులు ఉండవు. అలాంటి వారి గురించి, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కబీర్‌ధాం జిల్లా కలెక్టర్‌ గా పనిచేస్తున్న అవనీష్‌ శరన్‌ తీవ్రంగా ఆలోచించాడు.

అలా ' బైక్‌ అంబులెన్స్‌ ' పుట్టింది. 

వందలాది బైక్‌ అంబులెన్స్‌ను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. కొండల్లో చిన్న దారుల్లో ఉంటున్న గిరిజనుల గడపల వద్దకే ఈ అంబులెన్స్‌లు వెళ్లేలా చేయగలిగారు. దీంతో 90 శాతం ఆరోగ్య సేవల ఖర్చులు తగ్గాయి. సమయం కలిసొచ్చింది. డ్రైవర్‌, ఆశా వర్కర్‌, అటెండెంట్‌, రోగి ..ఇలా ఒకదానికి మరొకటి లింక్‌ వుండేలా ప్లాన్‌ చేశారు. 

ఒకపుడు డాక్టర్‌ దగ్గరకు వెళ్లాలంటే కనీసం 12 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండేది. ఇపుడా సమస్యలు లేకుండా, బైక్‌ అంబులెన్స్‌లు వారి ఇంటి ముందే వైద్య చికిత్సలు అందిస్తున్నాయి. ఎంతో కాలంగా ఉన్న సమస్యలు కలెక్టర్‌ శరన్‌ చొరవతో తొలగి పోయింది. మోటార్‌ బైక్‌ అంబులెన్స్‌లలో వైద్య సిబ్బందితో పాటు చికిత్సకు అవసరమైన మందులు ఉంటాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో కూడా... 

అరకు,సీతంపేట, పార్వరీపురం వంటి కొండ ప్రాంతపు గిరిజనుల కోసం బైక్‌ ఆంబులెన్సును ప్రవేశ పెట్టారు. అనారోగ్యంతో ఉన్నవారిని సకాలంలో అసుపత్రులకు చేర్చి ప్రాణాలు కాపాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఐటిడిఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో 200కు పైగా బైక్‌ ఆంబులెన్సులు ఏర్పాటు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: