దానిమ్మ పండు ప‌లు ఔష‌ధాల‌కు నిల‌యం. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇది చిన్న చిన్న జ‌బ్బుల‌ను నయం చేసుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో యాంటాక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఈ యాంటాక్సిడెంట్లు శ‌రీరంలోని హానికార‌క ఫ్రీరాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి. అలాగే వ్యాధి నిరోధ‌ర శ‌క్తిని పెంపొందిడంలో వీటి పాత్ర కీల‌కం. దానిమ్మ ఆరోగ్యానికి మేలు చేసే పండ‌ని వైద్య‌శాస్త్రం గుర్తించింది. దానిమ్మలోని అన్ని భాగాలు శ‌రీరానికి మంచి చేసేవే. దానిమ్మ గింజ‌లు అందానికి.. ఆరోగ్య నిల‌యాలు. వీటిలో విట‌మిన్ సీ, సిట్రిక్ యాసిడ్ ఇంకా చాలా ఉప‌యోగాలు ఉన్న ఆల్క‌లాయిడ్స్ ఉంటాయి. 


ఇక దీర్ఘాయుష్షుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్న  ‘యురోలిథిన్‌ ఏ’ అనే పదార్థాన్ని మనుషుల్లోనూ విజయవంతంగా పరీక్షించారు. స్విట్జ‌ర్లాండ్‌లోని ఈపీఎఫ్‌ఎల్ శాస్త్ర‌వేత్త‌లు చేసిన ప‌రిశోధ‌న‌ల ఆధారంగా ఓ విష‌యం స్ప‌ష్ట‌మైంది. వాళ్లు దానిమ్మ‌లో క‌నిపించే ఈ `యురోలిథిన్ ఏ` కొన్ని ర‌కాల పురుగులు, ఎలుక‌ల మీద ప్ర‌యోగించారు. వీరి ప్ర‌యోగంలో వాటి ఆయుష్షును గ‌ణనీయంగా పెంచింది.యురోలిథిన్‌ ఏ కణాల్లోని మైటోకాండ్రియా పనితీరును మెరుగుపరచడం ద్వారా వృద్ధాప్యంతో వచ్చే సమస్యలను నివారిస్తుందని అంచనా. 


అలాగే ఈ పండులో ఐర‌న్ అధిక మెత్తంలో ఉంటుంది.  ఐర‌న్ ఆక్సిజ‌న్ ర‌వాణాకి సాయ‌ప‌డుతుంది. ఆక్సిజ‌న్ ర‌వాణా స‌రిగ్గా జ‌రిగిందంటే చ‌ర్మం య‌వ్వ‌నంతో మెరిసిపోతుంది.  ఆసక్తికరమైన అంశం ఏమిటంటే..  ‘యురోలిథిన్‌ ఏ’ అనే  పదార్థం మ‌న‌కు తెలిసిన ఏ ఆహారంలోనూ ఉండదు. కాకపోతే దానిమ్మ, రాస్ప్‌బెర్రీ వంటి పండ్లలోని కొన్ని రసాయనాలు మన పేగుల్లో యురోలిథిన్ ఏ గా విడిపోతాయి. ఈపీఎఫ్‌ఎల్ శాస్త్రవేత్తలు ఈ `యురోలిథిన్ ఏ` ను కుత్రిమంగా త‌యారు చేసి దీని మీద ప్ర‌యోగాలు చేశారు. దీనిని ఆరోగ్యంగా ఉన్న 60 మందికి వేరువేరు మోతాదుల్లో ఇచ్చారు. 


కాక‌పోతే వీరు వ్యాయామాలు లాంటివి పెద్ద‌గా చేయ‌నివారు. వాళ్ల‌కు 500 నుంచి 1000 మిల్లీగ్రాములు ఈ మందును ఇచ్చినప్పుడు మైటోకాండ్రియా పనితీరులో మార్పు కనిపించిందని గ‌మ‌నించారు. అలాగే వ్యాయామం చేస్తే ఎలాంటి ఫ‌లితాలు ల‌భిస్తాయో అలాంటి ఫ‌లితాలు ఈ మందు ద్వారా వ‌చ్చాయ‌ని ఈ ప‌రిశోధ‌న‌ల్లో పాల్గొన్న శాస్త్ర‌వేత్త జొహాన్ అవురెక్స్ చెప్పారు. అంతేకాదు దానిమ్మ‌లో ఉన్న పొటాషియం, పీచుప‌దార్థాలు ఎక్కువ‌గా ఉంటాయి. దానిమ్మలో ఎలాజిక్ ఆసిడ్ ల‌భిస్తుంది. దీని వ‌ల్ల చాలా ర‌కాల క్యాన్స‌ర్ వ్యాధుల‌ను నివారించ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: