చాలా మంది చ‌న్నీటితో స్నానం చేసేందుకు వెనుక‌డుగు వేస్తుంటారు. చ‌ల్ల‌టి నీటితో స్నానం అంటే వ‌ణికిపోతుంటారు.చ‌లికాలంలో అయితే ప్ర‌తి ఒక్క‌రు వేడి నీళ్ల‌తో స్నానం చేసేందుకే ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే హైడ్రో థెర‌పీ వైద్యులు చెపుతోన్న దాని ప్ర‌కారం వేడి నీళ్ల కంటే చ‌న్నీళ్ల స్నాన‌మే ఎంతో మంచిది అంట‌.


పూర్వాకాలంలో నీటితో వైద్యం (హైడ్రో థెరపీ) డాక్ట‌ర్లు మందుల‌కు బ‌దులుగా వాడేవారు. నీటి వైద్యంతో ఎన్నో రోగాలు త‌గ్గేవ‌ట‌. ఈ ప‌ద్ధ‌తిలో చ‌ల్ల‌టి నీటినే వాడేవారు. అప్ప‌ట్లో ఈ వైద్యం బాగా ఫేమస్‌. ఇక ఇప్పుడు స్పాల‌లో సైతం చ‌న్నీళ్ల‌నే వాడుతున్నారు. క్ర‌మం త‌ప్పుండా చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తే అనేక రోగాలు న‌యం చేసుకోవ‌చ్చు.


చ‌న్నీళ్ల స్నానం వ‌ల్ల ఉప‌యోగాలు :
1- చ‌న్నీళ్ల స్నానం ఒత్తిడి త‌గ్గించ‌డంతో పాటు ర‌క్త ప్ర‌స‌ర‌ణ పెంచుతుంది. చర్మ‌కాంతి పెర‌గ‌డంతో పాటు యుక్త వ‌య‌స్సు ఉన్న వారిలా క‌నిపించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.
2- శరీర రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది. రోజూ చ‌న్నీళ్ల స్నానంతో శ‌రీరంలో రోగాల‌తో పోరాడే తెల్ల‌ర‌క్త‌క‌ణాల సంఖ్య పెరుగుతుంది. 
3- చర్మం నుంచి హానికరమైన రసాయనాలు తొలగిపోతాయి. మొటిమలు వంటివి రావు. చన్నీటి స్నానం వెంట్రుకలను నల్లగా చేసి వాటికి మెరిసే గుణాన్ని ఇస్తుంది. జుట్టు రాలకుండా చేస్తుంది. చుండ్రు రాకుండా ఉంటుంది.
4- ఎండోక్రిన్ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. దీంతో హార్మన్లు సరిగ్గా తయారవుతాయి. పురుషులు వేడి నీటి స్నానం చేస్తే వీర్య కణాల సంఖ్య తగ్గుతుంది.
5- చల్లని నీటితో స్నానం శరీరానికి శక్తిని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. రోజంతా మనసుకు ప్రశాంతత, ఆహ్లాదం లభిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: