పిల్ల‌ల‌కు జ్వ‌రం అనేది సాధార‌ణంగా వ‌స్తుంటుంది. జ్వ‌రం వ‌చ్చినప్పుడు పిల్ల‌ల త‌ల్లిదండ్ర‌లు కంగారు ప‌డుతుండ‌డం స‌హజం. అయితే ఎలాంటి జ్వ‌రాల‌కు ఆందోళ‌న చెందాలి ? అస‌లు శ‌రీర ఉష్ణోగ్ర‌త ఎన్నీ డిగ్రీలుంటే దాన్ని జ్వ‌రం అనుకోవాలి వంటి విష‌యాల్లో క్లారిటీ ఉంటే టెన్ష‌న్ ఉండ‌దు. ఒక్కోసారి పిల్ల‌లు ఎండ‌ల్లో ఆట‌లాడి అల‌సిపోయిన‌ప్పుడు కూడా జ్వ‌రాలు వ‌స్తాయి. పిల్ల‌ల్లో జ్వ‌రాలు, వాటి ల‌క్ష‌ణాలు తెలుసుకుందాం.


- ఎక్కువ‌గా పిల్ల‌ల‌కు మ‌లేరియా జ్వ‌రాలు వ‌స్తుంటాయి. ఇంకా వైర‌ల్‌కు సంబంధించి డెంగ్యూ, చికున్‌గున్యా ఫీవ‌ర్లు వ‌స్తుంటాయి. 18 ఏళ్లు దాటిన పిల్ల‌ల్లో సాధారణ ఉష్ణోగ్ర‌త 98.6 ఫార‌న్‌హీట్ ఉంటుంది. రెండేళ్ల‌లోపు 50 శాతం మంది పిల్ల‌ల్లో జ్వరం లేకుండానే వారి టెంప‌రేచ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. దాని వ‌ల్ల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.


- చిన్న పిల్ల‌ల‌కు జ్వ‌రం వ‌చ్చిన వెంట‌నే ఆందోళ‌న ప‌డ‌కూడ‌దు. మెద‌డులోని హైపోత‌ల‌మ‌స్‌లో ఉష్ణోగ్ర‌త నియంత్రించే కేంద్రం ఉంటుంది. ఐదేళ్లలోపు పిల్ల‌ల‌కు ఈ కేంద్రానికి స‌రైన శ‌క్తి నియంత్ర‌ణ ఉండ‌దు. 


- జ్వ‌రం రాగానే ఎందుకు జ్వ‌రం వ‌చ్చిందో నిర్ధార‌ణ చేసుకోవాలి. ముందుగా మ‌లేరియా జ్వ‌రం వ‌చ్చిందేమోన‌ని భావించాలి. తెల్ల‌ర‌క్త క‌ణాలు, ప్లేట్‌లెట్స్ త‌నిఖీ చేసుకోవ‌డం ద్వారా యూరిన్ ట్రాక్ ఇన్‌ఫెక్ష‌న్ ఏ స్థాయిలో వుందో తెలుస్తుంది. 


- ఒక్కోసారి మెద‌డులో జ‌బ్బులు లేక‌పోయిన పిల్ల‌ల‌కు 105, 106 డిగ్రీల టెంప‌రేచ‌ర్ ఉంటుంది. చంక‌లో టెంప‌రేచ‌ర్ ఎక్కువ‌గాను, నోట్లో త‌క్కువ‌గాను ఉంటుంది. నెల‌లలోపు బిడ్డ టెంప‌రేచ‌ర్ చూసిన‌ప్పుడు మూడు నిమిషాలు చంక  భాగంలో పెట్టి చూడాలి. 


- పిల్ల‌ల్లో వైర‌ల్ జ్వ‌రాలు రెండు వారాల్లోగా త‌గ్గుతాయి. మ‌లేరియా జ్వ‌రం వ‌చ్చినప్పుడు కాళ్లు చేతులు చ‌ల్ల‌గా,  ఉద‌ర‌భాగం వెచ్చ‌గా ఉంటుంది. పిల్ల‌ల‌కు ఒక‌సారి వ‌చ్చిన జ్వ‌రం మ‌ళ్లీ వ‌చ్చిన‌ట్ల‌యితే చిన్న పిల్ల‌ల వైద్య‌నిపుణుల్ని క‌లిసి వారి స‌ల‌హా మేర‌కు మందులు వాడాలి. అలాగే జ్వరం వ‌చ్చిన‌ప్పుడు చ‌ల్ల‌గాలి, మంచి వెలుతురు ఉన్న‌ట్ల‌యితే త‌ర్వ‌గా కోలుకుంటారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: