పండగైన, ఫంక్షనైనా, పెళ్ళైన,పూజలైన, ఫ్యామిలీతో ఉన్న,ఫ్రెండ్స్ ని కలిసిన ఒకటే మాట "ఒక్క సెల్ఫీ",అవును సెల్ఫీ అనేది ఇప్పుడు ట్రెండ్ అయ్యింది. కొందరైతే సెల్ఫీ మోజులో పడి తమ ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు,దాదాపు దశాబ్ద కాలంగా సెల్ఫీ మోజులో చనిపోయేవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా షార్క్ చేపల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కంటే 5 రెట్లు ఎక్కువగా ఉందని భారత్ కు చెందిన ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్ జర్నల్ పేర్కొంది.

ఓ సర్వే ప్రకారం అక్టోబర్ 2011 నుంచి నవంబర్ 2017 మధ్య సెల్ఫీ తీసుకుంటూ చనిపోయిన వారి సంఖ్య 259మంది కాగా ఇందులో మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు 159 మంది. భారతదేశంలో అబ్బాయిలు, అమ్మాయిలు ఎక్కువగా సెల్ఫీలు తీసుకోవడానికి ఇష్టపడతున్నారు.భారత్ తర్వాత రష్యాలో ఈ సెల్ఫీల మోజు ఎక్కువగా ఉంది.

అబ్బాయిలైతే విచిత్రమైన సాహసాలు చేస్తూ,వింత వింత ఫోజులిస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారు .నీటిలో మునిగిపోవడం, వాహనాలు గుద్దుకోవడం వీడియో చిత్రీకరణ లో మునిగిపోయి వుండగా జరుగుతున్న ప్రమాదాలు. సెల్ఫీల మోజులో ప్రాణాలను కోల్పోతుండడంతో ముంబైలో 16 ప్రాంతాల్లో సెల్ఫీలను ప్రభుత్వం నిషేధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: