జీడిపప్పును చాలా మంది వంటల్లో ఎక్కువగా వాడుతారు. దీంతో వంటలు రుచికరంగా ఉంటాయి. మంచి వాసన వస్తుంది. అయితే కేవలం రుచికే కాదు, జీడిపప్పు మనకు ఆరోగ్యకర ప్రయోజనాలను కూడా అందజేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. శరీరానికి సంపూర్ణ పోషకాహారాన్ని ఇవి అందిస్తాయి. ఈ క్రమంలోనే రోజూ గుప్పెడు జీడిపప్పు తింటే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


- జీడిపప్పులో తక్కువ శాతం కొవ్వు ఉంటుంది. అంతేకాకుండా, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే ‘ఒలిక్ ఆసిడ్’ కూడా ఇందులో ఉంటుంది. పిండిపదార్థాలు అధికంగా ఉండే ఈ పప్పులో చక్కెర, పీచుపదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్ బి1, విటమిన్ బీ2, విటమిన్ బి3, విటమిన్ బి5, విటమిన్ బి6, విటమిన్ సి, కాల్షియమ్, ఐరన్, మెగ్నీషియమ్, పొటాషియం, జింకు వంటి ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

- ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ పెరుగుదల నివారణలో జీడిపప్పు ముఖ్యపాత్ర పోషిస్తుంది. 


- జీడిపప్పును రోజూ గుప్పెడు మోతాదులో తింటుంటే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ పోతాయి. మానసిక సమస్యలతో సతమతమయ్యే వారు రోజూ జీడిపప్పు తినాలి. దీంతో ట్రిప్టోఫాన్ అనే రసాయనం వ‌ల్ల మంచి ఉత్తేజంగా ఉంటారు.


- జీడిప‌ప్పుతో శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులను రాకుండా చూస్తుంది.


- మన శరీరానికి అవసరం అయ్యే చాలా విటిమన్లు, మినరల్స్ జీడిపప్పు ద్వారా లభిస్తాయి. దీంతో హార్మోన్లు చక్కగా పనిచేస్తాయి.


- శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.


- రోజూ జీడిపప్పును తింటే నేత్ర సంబంధ సమస్యలు పోతాయి. దృష్టి బాగా ఉంటుంది. గ్లకోమా, శుక్లాల సమస్య రాదు.


- గుండె జబ్బులు రావు. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది.


-  శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఇది బరువును తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. 


- రోజూ జీడిపప్పును తింటుంటే నెల రోజుల్లో 30 శాతం వరకు బరువు తగ్గవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: