రోజూ పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాలు శరీరానికి కావాల్సిన పోషకాలతో పాటు.. మెదడును ఎంతో చురుగ్గా ఉంచుతాయి. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడులోని కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ మూడు గ్లాసుడు పాలు తాగేవారు వ్యాధులకు దూరంగా ఉంటారని పలు పరిశోధనలు తెలుపుతున్నాయి. అలాగే పాలు తాగితే ఎంతో బలం... ఎంతో అందం కూడా. పాలతో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చని చెబుతున్నారు. పాలు తాగడం వల్ల, ముఖానికి పూతలా వేయడం వల్ల కూడా అనే లాభాలు ఉన్నాయని చెప్పారామె. 


- పాలు శరీరం బయట, లోపల కూడా క్లెన్సర్ లా ఉపయోగపడతాయి. పాలు రోజు తాగడం వల్ల చర్మగ్రంథులు శుభ్రపడతాయి. 


- పాల‌లోని గుణాలు మురికిని, మృత కణాలను బయటికి పంపేస్తుంది. బ్లాక్ హెడ్స్, మొటిమలు రాకుండా అడ్డుకుంటాయి. 


- దూదిని పాలల్లో ముంచి ముఖంపై మెత్తగా మర్ధనా చేయాలి. ఇలా అయిదు నిమిషాల పాటూ చేసి... తరువాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ముఖంపై ఉన్న జిడ్డు పోతుంది. మురికి పోయి శుభ్రపడుతుంది. 


-  పళ్ళు, ఎముకలకు కాల్షియం అవసరం. పాలు రెగ్యులర్‌గా తాగితే ఎముకలు గట్టిపడి, పళ్ళు కూడా బలపడతాయి.


- పొడిచర్మం ఉన్న వారైతే దూదిని పాలలో ముంచి ముఖమంతా మర్ధనా చేసుకున్నాక, 20 నిమిషాల పాటూ అలా వదిలేయాలి. అనంతరం చల్లని నీటితో కడుక్కోవాలి. 


- పాల వల్ల కూడా మీ శరీరంలో నీటిస్థితి సమంగా ఉంటుంది.  వ్యాయామం అయిన వెంటనే పాలను తాగితే శరీరాన్ని తాజాగా మార్చుకోవ‌చ్చు.


- పాలల్లో అరటి గుజ్జును కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. అరగంట తరువాత కడిగేసుకోవాలి. చర్మం పొడిగా మారడం తగ్గి, చర్మం తేమవంతంగా మారుతుంది. 


- ఎండలో చర్మం కమిలినట్టు అయితే ఫ్రిజ్‌లో ఉంచిన చల్లని పాలను ముఖానికి పట్టించాలి. చర్మానికి రక్షణగా ప్రొటీన్ పొర ఏర్పడుతుంది. ముఖం మండడం తగ్గిపోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: