స్మోకింగ్ మనిషిని చంపేస్తుంది. ఈ విషయం సిగ‌రెట్ ప్యాకెట్ల మీద రాసి ఉంటుంది. అయినా స్మోకింగ్ ప్రియులు మాత్రం ఈ అల‌వాటు వ‌దులుకోలేరు. చాలా మంది భార్యలకు తమ భర్తలు స్మోక్ చేయడం నచ్చదు. ముఖ్యంగా సెక్స్ చేసే టైంలో స్కోక్ చేసి వ‌స్తే దానిని వారు అస్స‌లు అంగీక‌రించ‌రు. స్కోకింగ్ వాస‌న ఎవ్వ‌రికి న‌చ్చ‌దు. ఇదిలా ఉంటే స్కోకింగ్ అల‌వాటు ఉన్న వారు సెక్స్ సామ‌ర్థ్యాన్ని చాలా వ‌ర‌కు కోల్పోతార‌ని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.


ఎప్పుడైనా ఒక‌టీ అరా మిన‌హాయిస్తే రోజులో పెట్టెల‌కు పెట్టెలు సిగ‌రెట్లు కాల్చేస్తే లైంగీక సామ‌ర్థ్యం చాలా వ‌ర‌కు త‌గ్గిపోతుంద‌ట‌. సిగరెట్ లైంగిక వ్యవస్థ పై చెడు ప్రభావాన్ని చూపుతుంది. సిగ‌రెట్ /  పొగాకులో ఉండే నికోటిన్ రక్త ప్రవాహ వ్యవస్థను దెబ్బతీస్తుంది. అంగ స్తంభన జరగాలంటే రక్తం అంగంవైపు ప్రవహించాలి. సిగరెట్ ఆ వేగానికి అడ్డుకట్ట వేస్తుంది. 


ఒక్క‌సారి అంగ‌స్తంభ‌న ప్రారంభ‌మైతే అది గుండె సంబంధిత వ్యాధుల‌కు సూచ‌న అని గ్ర‌హించాలి. ఇక భ‌ర్త పొగ‌తాగితే పరోక్షంగా భార్య కూడా తాగినట్టే. ధూమపాన పర్యవసానాల్ని ఆమె కూడా అనుభవించాల్సిందే. దీంతో తన లైంగిక ఆరోగ్యమూ ప్రమాదంలో పడుతుంది. రక్తప్రవాహ వేగం మందగించడంతో భావప్రాప్తి సమస్యలు వస్తాయి. యోనిలో లూబ్రికేషన్‌ తగ్గిపోతోంది. ఇంకా చెప్పాలంటే సిగ‌రెట్ వాస‌న ప‌డ‌నివాళ్లు సెక్స్ ప‌ట్ల విర‌క్తి పెట్టుకునే ప్ర‌మాదం కూడా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: