బరువును తగ్గించే, కొంబుచా టీ !!

మనం రుచి చూసే,వివిధ రకాల టీలలో కొంబుచా టీ రుచేవేరు. దీనిని రష్యాలో మొదటి సారిగా తయారు చేశారట. కానీ, కొన్ని వందల ఏళ్ల నాటి నుంచే ఈ టీని అనేక దేశాల్లోని ప్రజలు సేవిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలకూ ఈ టీ రుచి తెలిసింది. అందుకే ఈ టీని తాగేందుకు ఇప్పుడు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొంబుచా టీని తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుంటారా ?

1 . గ్రీన్‌ టీ లాగే కొంబుచా టీలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తరుచూ వ్యాధులు రాకుండా చూస్తాయి.

2. డయాబెటిస్‌ ఉన్నవారు నిత్యం కొంబుచా టీని తాగితే మంచిది. వారి రక్తంలో ఉండే షుగర్‌ స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది.

3. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే గుణాలు కొంబుచా టీలో ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది.

4, కొంబుచా టీలో ఉండే ప్రొ బయోటిక్స్‌ జీర్ణాశయం, పేగుల్లో ఉండే మంచి బాక్టీరియా సంఖ్యను పెంచుతాయి. దీంతో జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణాశయం, పేగుల్లోని సూక్ష్మ క్రిములు నశిస్తాయి.

5,ఈ టీని నిత్యం తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం బాగా తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. ఈ టీని నిత్యం సేవిస్తే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. దీంతో అధిక బరువు కూడా తగ్గుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: