స‌హ‌జంగా ఇప్పుడు ఎక్క‌డ చూసిన రోడ్ల‌పై అమ్మాయిలు, అబ్బాయిలు నోట్లో చూయింగ్ గ‌మ్ న‌ములుతూ ఉంటారు. ఆఫీసుల్లో ఉద్యోగులు కూడా చూయింగ్‌గ‌మ్ న‌మ‌ల‌డం అల‌వాడు. ఇంత కొంత వ‌ర‌కు మంచిదే. ఎన్నోర‌కాల అనారోగ్య ప‌రిస్థితులు ఈ దంత క్ష‌యానికి కార‌ణ‌మ‌వుతాయి. క‌డుపులో ఆమ్లాలు నోటిలోకి రావ‌డం వీటిలో ప్ర‌ధాన స‌మ‌స్య‌. దీనిని గ్యాస్ట్రో ఎనోఫాజియ‌ల్ అంటారు. హైయాటిస్ హెర్నియా స‌మ‌స్య‌లో నోటి నుండి క‌డుపులోకి ఆహారం వెళ్లే మార్గం పుండు ప‌డ‌టం వ‌ల్ల బాధ‌ప‌డే వారు, అధికంగా మ‌ద్యం సేవించే వారు ఎక్కువ‌గా వాంతు చేసుకోవ‌డం కార‌ణంగా ఆమ్ల‌ప్రభావానికి గురై దంత‌క్ష‌యానికి గుర‌వుతున్నారు.


డెంటైన్ అనేది సున్నిత‌మైన పంటిభాగం. ఇది బ‌య‌ట‌ప‌డిన‌ప్పుడు లేదా క్ష‌య‌మున‌కు లోన‌యిన‌ప్పుడు ప‌ళ్లు రంధ్రాలు ప‌డ‌టం జ‌రుగుతుంది. అలాగే ఈ డెంటిన్ సున్నితంగా ఉండ‌డంతో వేడి, చ‌ల్ల‌ని, తీపి ప‌దార్థాలు  తిన్నా తాగినా పంటికి నొప్పి క‌ల‌గ‌డం జ‌రుగుతుంది. దంత‌క్ష‌యం వ‌ల‌న ప‌ళ్లు అంద‌విహీనంగా, రంగుమారి చిన్న‌విగా ఉంటాయి. నారింజ, నిమ్మ వంటి మొద‌లైన సిట్రిక్ ఆమ్లం క‌ల్గిన ప‌ళ్లు, ప‌ళ్లర‌సాలు పంటికి హాని క‌లిగిస్తాయి. ఆమ్ల స్వ‌భావం క‌లిగిన ఆహార ప‌దార్ధాలు కూడా పంటికి హాని క‌లిగిస్తాయి.


ఇక సోడాగ్యాస్ క‌లిగిన ద్ర‌వాలు, కూల్ డ్రింక్స్ ప‌ళ్ల‌కు ఎంతో హాని చేకూర్చుతుంది. ఆమ్ల స్వ‌భావం క‌ల్గిన ఆహార ప‌దార్ధాలు ఒక్క‌సారి భోజ‌న స‌మ‌యంలో మాత్రం తీసుకోవ‌చ్చు. కానీ ఇలాంటి ప‌దార్ధాలు తిన్నా, తాగిన త‌ర్వాత కొంత కాల వ్య‌వ‌ధిలో బ్రెష్ చేసుకుంటే మిన‌ర‌ల్స్ వృద్ధి జ‌రిగి దంత‌క్ష‌యం త‌గ్గుతుంది. ఆమ్ల పూరిత‌మైన ఆహార ప‌దార్ధాలు తీసుకోవ‌డం వ‌ల్ల వాటి ప్ర‌భావం ప‌ళ్ల‌పై ప‌డి గార‌ప‌ట్ట‌డం జ‌రుగుతుంది. ఇది దంత‌క్ష‌యానికి కార‌ణం అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: