పాలు, పెరుగు మన నిత్యజీవితంలో భాగమైపోయాయి. నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి తిరిగి నిద్రపోయే వరకు ఏదొక రూపంలో పాల ఉత్పత్తుల తీసుకుంటూనే ఉంటాం. అన్నం తినేటప్పుడు పెరుగు తీసుకోకపోతే చాలామందికి వెలితిగా ఉంటుంది. రోజూ పెరుగు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు కూడా చెబుతుంటారు. అయితే మన పెద్దలు రాత్రిపూట పెరుగు తినకూడదని హెచ్చరిస్తుంటారు. రాత్రిపూట నేరుగా గానీ, అన్నంలో కలుపుకుని గానీ పెరుగు తింటే జలుబు, శ్వాస సంబంధమైన సమస్యలు వస్తాయని చెబుతుంటారు. రాత్రిపూట పెరుగు తింటే నిజంగా ప్రమాదమా? దీనిపై డాక్టర్లేమంటున్నారు.. 


- పెరుగు వల్ల చాలా ఉపయోగాలున్నాయి. రోజూ ఆహారంలో తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థను మెరుగుపడుతుంది. పెరుగును అన్నంలో తినడం నచ్చని వారు కూరల్లో, స్వీట్లలో, ఎలాగైనా వాడుకోవచ్చు. ఏదో రూపంలో పెరుగును ఆహారంలో తీసుకోవడం మంచిది. 


- పెరుగా ఎలా తిన్నా దాని పోషకాలు, ఉపయోగాలు మనకు అందుతాయి. పెరుగు పాలతో తయారైనప్పటికీ పాల కన్నా ఎక్కువ కాల్షియం కలిగి ఉండడంతో ఎముకలకు, పళ్ళకు బలాన్నిస్తుంది. ఎముకలను పెళుసుబారకుండా కాపాడుతుంది.  


- పెరుగు శరీరానికి అన్ని రకాలుగానూ మంచిదే. రోజుకో గ్లాసు పాలు, కప్పు పెరుగు తింటే మనకు కావాల్సిన ప్రొటీన్ మొత్తం అందుతుంది. 


- పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అరుగుదల సమస్యను నివారిస్తుంది. శరీరానికి చలవ చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 


- శాకాహారులు పాల పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే విటమిన్ బీ12 లభిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు కల్పించే పెరుగు కేవలం పగలు మాత్రమే తినాలి, రాత్రిపూట తినకూడదు అన్న వాదన సరైనది కాదు. 


- ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగు రాత్రి తింటే మాత్రం జలుబు చేసే అవకాశాలున్నాయి. అందువల్ల రాత్రిపూట ఫ్రిజ్‌లోంచి తీసిన పెరుగు కాకుండా బయట ఉంచిన పెరుగు తింటే ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు.  


మరింత సమాచారం తెలుసుకోండి: