స్నానం అంటేనే ఉపశమనం. అయితే కొంతమంది చల్లని నీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు. మరికొందరు వేడి నీటి స్నానం ఇష్టపడతారు. అయితే.. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. గోరువెచ్చని నీటితో స్నానం వల్ల రకరకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.


గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శారీరక ఉత్సాహంతోపాటు.. మానసిక ఒత్తిడిని కూడా జయించవచ్చు. రాత్రి పడుకునే ముందు, వ్యాయామానికి ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేసి చూడండి.. ఫలితాలు మీకే కనిపిస్తాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల పొందే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..


- హాట్ వాటర్ తో స్నానం చేయడం వల్ల శరీరానికి చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది.. అలాగే త్వరగా నిద్రపోవడానికి సహయపడుతుంది. వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల.. శరీర ఉష్ణోగ్రత తగ్గతుంది.. కండరాలు రిలాక్స్ అవుతాయి. శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా.. చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది.


-  గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు, కీళ్లకు మంచిది. అలాగే కండరాలు, కీళ్ల నొప్పులను కూడా గోరువెచ్చని నీళ్లు తగ్గిస్తాయి. 


- తలకు ఎసెన్షియల్ ఆయిల్ పెట్టి.. గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం వల్ల.. చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇలా చేయడం వల్ల బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది. హాట్ వాట‌ర్‌తో స్నానం చేయ‌డం వ‌ల్ల త‌లనొప్పి త‌గ్గుతుంది.


- రక్తప్రసరణ సజావుగా సాగడానికీ గోరువెచ్చని నీళ్లు సహాయపడతాయి. అయితే పూర్తీగా కాకపోయినా.. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల నొప్పి, వాపుతోపాటు అలసట కూడా తగ్గుతుంది.


- చర్మంపై మలినాలు పేరుకోవడానికి రంధ్రాలు కారణమవుతాయి. గోరువెచ్చని నీళ్లు ఈ రంధ్రాలు తెరుచుకునేలా చేసి.. శుభ్రం చేస్తాయి. దీనివల్ల శరీరంపై మురికి క్లీన్ అయి.. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.


- హాట్ వాటర్ తో స్నానం చేయడం వల్ల.. బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు.. ఇది చక్కటి పరిష్కారం.


- మధుమేహంతో బాధపడేవాళ్లు హాట్ టబ్ బాత్ చేయడం వల్ల రక్తంలో షుగర్, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. 20 నుంచి 30 నిమిషాల పాటు వారానికి 6సార్లు హాట్ టబ్ బాత్ చేయడం వల్ల దాదాపు రెండున్నర కేజీల బరువు తగ్గవచ్చని అధ్యయనాలు నిరూపించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: