ఎవరినైనా అతిగా పొగుడుతుంటే,
'' మునగ చెట్టు ఎక్కిస్తున్నారు... పడిపోతాడు...'' అని నానుడి. అంటే మునగ చెట్టు కొమ్మలు బలహీనంగా ఉంటాయి. కానీ, ఇది చదివితే మునగ చెట్టు ఎక్కి తీరాల్సిందే... అనిపిస్తుంది. మన పరిసరాల్లో ఉండే మొక్కలే మానవులకు వచ్చే అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతాయని సైంటిస్టులే అంటున్నారు.
మన ఇంటి పెరట్లో ఎక్కువగా పెరిగే మునగ చెట్టు గొప్పతనం కూడా ఇంకా ఎవరికీ తెలియదు. కానీ సైంటిస్టులు మాత్రం ఈ చెట్టును మహత్తు ఉన్న చెట్టు అని నిర్దారించారు. ఇదీ పరిశోధన... బెంగళూరులోని జాతీయ బయోలాజికల్‌ పరిశోధన సంస్థ సైంటిస్టులు మునగ చెట్టుకు చెందిన 36 రకాల జన్యువులపై పరిశోధనలు చేశారు. ఒక మునగ చెట్టు నుంచి వివిధ భాగాలు సేకరించి పరిశోధనలు చేశారు.

మునగ చెట్టుకు చెందిన ఆకులు, కాయలు, వేర్లు, పూలు.. ఇలా అన్ని భాగాలను పరిశీలించి, ప్రయోగాలు చేశారు. దీని ఫలితంగా వారేమంటారంటే... మునగ చెట్టులోని అన్ని భాగాలు మానవుల అనారోగ్య సమస్యలను నయం చేసేందుకు పనికొస్తాయని, ఆ మాటకొస్తే క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా ఆ చెట్టు భాగాలతో నయం చేయవచ్చని చెబుతున్నారు.

1, మనిషి ఎదుగుదలకు అవసరం అయ్యే ముఖ్యమైన పోషకాలు మునగ ఆకులు, పూలలో ఉన్నాయని గుర్తించారు. అలాగే విటమిన్‌ సి కూడా మునగ ఆకులు, పూల ద్వారా బాగా లభిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.

2, మునగ చెట్టు ఆకులు, పూలు, కాయల్లో ఐరన్‌, జింక్‌, మెగ్నిషియంలు పుష్కలంగా ఉంటాయని, సైంటిస్టులు చెబుతున్నారు. ఇవి మనం ప్రస్తుతం తింటున్న వైట్‌ రైస్‌లో లోపిస్తున్నాయని, అందుకనే, అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.

3, పాలకూరలో ఉండే ఐరన్‌ కన్నా మునగ ఆకులలో ఐరన్‌ 30 శాతం ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు తేల్చారు. అలాగే పాలకూరలో ఉండే కాల్షియం కన్నా మునగ ఆకులో ఉండే కాల్షియం 100 రెట్లు ఎక్కువగా ఉంటుందట.

4, మునగ ఆకులతో నీటిని శుద్ధి చేసుకోవచ్చని, అలాగే నూనెలను కూడా శుద్ధి చేసుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. మునగ పూలలో కేఎం ఫెరోల్‌ అనబడే క్యాన్సర్‌ నిరోధక ఏజెంట్‌ ఉంటుంది. ఇది క్యాన్సర్‌ రాకుండా అడ్డుకుంటుంది.
మునగ చెట్టు వేర్లలో ఉర్సోలిక్‌, ఓడియానోలిక్‌ అనే ఆమ్లాలు ఉంటాయి. ఇవి సంతాన లేమి, క్యాన్సర్‌ కు మందులుగా పనిచేస్తాయి అని రీసెర్చ్‌లో తేలింది కాబట్టి , ఇక ఎక్కడ మునగ చెట్టు కనబడినా ఎక్కి నాలుగాకులో,కాయలో కోసి పప్పులోనో, సాంబారులో లోనో వేసుకొని తినడం మరవకండి.


మరింత సమాచారం తెలుసుకోండి: