వేప రసాన్ని ఆయుర్వేద వైద్యంలో ఒక మందుగా గుర్తిస్తారు. దీనితో ఆరోగ్య ప్రయోజనాలు అధికం. దీనివలన శరీరంలోని వివిధ భాగాలకు, చర్మానికి, జుట్టుకు ఎన్నో లాభాలున్నాయి. వేప నుండి నూనెను కూడా మందులలో, సబ్బులలో వాడతారు. వేప చెట్టు గాలి వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది. వేప పువ్వును ఉగాది పండుగకు పచ్చడిలో కూడా ఉపయోగిస్తారు. ఈరకంగా మానవుడికి వేప చెట్టు వలన లాభాలు ఎన్నో వున్నాయి. వాటిని పరిశీలిస్తే...


-  వేప రసం తాగితే శరీరంలోని మలినాలు బయటకు పోతాయి. దానితో జుట్టు, చర్మం మంచి పోషణ కలిగి ఆరోగ్యంగా ఉంటాయి. వేప రసం జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. 


- వేప రసానికి మంటను తగ్గించే గుణం ఉంది. వేపరసం మొటిమలను తగ్గించటానికి కూడా వాడతారు. ముఖ వర్చస్సు పెరగాలంటే వేప రసం రాయాలి.


- కళ్ళపై కొద్ది చుక్కల వేప రసం కంటి చూపును మెరుగుపరుస్తుంది. కామెర్ల వ్యాధిని తగ్గిస్తుంది. 


- డయాబెటీస్ రోగులకు వేప ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ వేప రసం తాగితే రక్తంలోని షుగర్ లెవెల్ నియంత్రణలో ఉంటుంది. 


- వేప రసం శరీరానికి మర్దన చేస్తే నల్లటి మశూచి మచ్చలు కూడా పోతాయి. గజ్జి, స్మాల్ పాక్స్ మొదలైనవి కూడా వేపరసంతో నివారణ చేసుకోవచ్చు. 


- గర్భవతికి నొప్పులు తగ్గాలంటే, కడుపు, యోని భాగాలకు వేపరసం మర్దన చేస్తే ఫలితం ఉంటుంది. 


- అలాగే వేపాకును తేనెతోమ‌రియు నిమ్మ‌ర‌సం క‌లిపి ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వును త‌గ్గించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.


ఇన్ని ప్రయోజనాలు కల వేపరసం తాగాలంటే ఎంతో చేదు. కనుక, దీనిలో కొద్దిపాటి ఉప్పు లేదా మిరియంపొడి కలిపి తాగవచ్చు. వాసన కూడా ఉంటుంది. అయితే దీనిలో గల లాభాల కారణంగా వాసన తగ్గటానికి గాను ఫ్రిజ్ లో 15 నుండి 20 నిమిషాలు వుంచి లేదా ఐస్ ముక్కలు కలిపి తాగవచ్చు. వేపరసం తీసిన వెంటనే తాగండి. అరగంటకు మించి నిలువ వుంచరాదు. వేపరసంలో షుగర్ కలిపితే దాని ఫలితాలు తక్కువగా ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: