ఇలాచ్చి పేరు వినగానే మొదటగా చక్కటి వాసన గుర్తొస్తుంది. ఇలాచ్చి 'సిట్రస్' జాతికి చెందిన వృక్షం. భోజనంలో ఇది కలిగించే సువాసనను, మరి ఏ ఇతర జాతికి చెందిన మూలకాలు ఇవ్వలేవు. ఇది వంటకాలలో మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలాచ్చిని అయ్యుర్వేద వైద్య ములికల తయారీలలో ఉపయోగించి, అల్సర్, జీర్ణక్రియ సంబంధించిన, డిప్రెషన్ వంటి వాటికి చికిత్స కోసం వాడతారు. 


భార‌తీయులు ఎప్ప‌టి నుంచో యాల‌కుల‌ను త‌మ వంట ఇంటి పోపు దినుసుల్లో ఒక‌టిగా ఉప‌యోగిస్తున్నారు. అలాగే యాల‌కుల‌ను అనేక ర‌కాల తీపి ప‌దార్థాల్లోనూ వేస్తుంటారు.అయితే ఆయుర్వేద ప్ర‌కారం యాల‌కుల్లో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా యాల‌కుల వ‌ల్ల మ‌నం అధిక బ‌రువును చాలా తేలిగ్గా, త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రియు వీటి ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..!


- యాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషీయం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. యాలకుల్లో ఉండే పొటాషియం గుండె పని తీరును, అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.


- డయాబెటిస్ ను యాలకులు కొంత మేరకు అదుపులో ఉంచగలవు. వీటిలో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహం రాకుండా అడ్డుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. 


- యాలకుల్లో విటమిన్ సి ఉంటుంది. ఇది మీ చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. చర్మాన్ని చాలా సున్నితంగా మార్చేందుకు యాలకులు బాగా ఉపయోగపడుతాయి. చర్మంపై ముడుతలు లేకుండా యాలకులు చేస్తాయి.


- క్యాన్సర్ కారక కణాలపై పోరాడడంలో యాలకులు బాగా పని చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడగలవు. 


- ఆస్తమాను కాస్త అదుపులో ఉంచగలిగే గుణాలు యాలకుల్లో ఉంటాయి. ఆకుపచ్చని యాలకులు గురక తగ్గించేందుకు, దగ్గు నివారణకు, శ్వాస ఆడకపోవడాన్ని తగ్గించేందుకు బాగా పని చేస్తాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: