Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 1:26 pm IST

Menu &Sections

Search

ఆషాడంలో గోరింటాకు ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా..?

ఆషాడంలో గోరింటాకు ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా..?
ఆషాడంలో గోరింటాకు ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆషాడ మాసం.. ఆషాడ మంత్, ఆది మాసం అని పిలుస్తారు.  ఆది అంటే శక్తి అని అర్థం. పండితుల ప్రకారం ఆషాడ మాసం పవిత్రమైనది కాదు. ఈ నెలలో శుభకార్యాలకు మంచిది కాదని ఆషాడంలో ఎట్టిపరిస్థితుల్లో వివాహాలు జరిపించరు.  అలాగే ఆషాడ మాసంలో కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకూడదనే ఒక నమ్మకం కూడా ఉంది. ఆషాడంలో గోరింటాకు పెట్టుకునే ఆచారం ఆనాదిగా ప్ర‌బ‌లంగా ఉంది. గోళ్ల‌కు రంగును క‌లిగించే గోరింటాకు `` న‌ఖ‌రంజిని`` అని పేరు. 


ఆషాఢం నెల గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే... జ్యేష్ఠ మాసంలో వానలు కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా ఎక్కువగా వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు ఏరు దాటాల్సి వచ్చేవారు... ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడపకుండా రోజుని దాటించలేరు.


అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. గోరింటాకునకు ఒంట్లోని వేడిని తగ్గించే ఔషధ‌ గుణం కలిగి ఉంది.బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి శ‌రీరానికి మేలు చేస్తుంది. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు గోరింటాకు పెట్టుకుని,పెట్టుకున్న గోరింటాకు ఇచ్చే రంగును చూసుకుని మురిసిపోతూ వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. 


పుట్టింట ఉన్న మనసు మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది.వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి అందంగానే కాకుండా గోళ్లు పెళుసుబారి పోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం గోరింట ఆకులే కాదు... పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు... అన్నీ ఔషధయుక్తాలే ! దీని వ‌ల్ల శ‌రీరంపై ఉన్న అలెర్జీలకు దూరం చేసుకోవచ్చు. బోదకాలు వ్యాధి -ఏనుగు కాలు (లింఫాటిక్‌ ఫైలేరియాసిస్‌) దరిచేరదు. పూర్వం నుంచి ఆట‌ల‌మ్మ మచ్చలు పోగొట్టాలంటే గోరింటాకు బాగా నూరి మచ్చలపై పూస్తే మంచి ఫ‌లితం ఉంటుంద‌ని చెబుతారు. 


అలాగే నెలకోసారి గోరింటాకు పేస్ట్‌తో తలకు ప్యాక్ వేసుకుంటే.. జుట్టు బలపడి జుట్టు రాలడానికి చెక్ పెట్టవచ్చు. గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నదే! కేవలం ఆషాఢంలోనే కాదు... శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు. 


గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు.గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్‌ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో, కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలెర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి.  



uses-of-henna-leaves
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎంతో సులువుగా `వంకాయ రొయ్యల క‌ర్రీ`
డయాబెటిస్ లక్షణాలు.. ఖ‌చ్చితంగా తెలుసుకోండి..
దాల్చిన చెక్క‌తో అదిరిపోయే బ్యూటీ సీక్రెట్స్‌..
బాదం మిల్క్‌తో ఆ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టండిలా..
ఎంతో రుచిక‌ర‌మైన `పనీర్‌ బిర్యానీ`
గసగసాలతో ఆశ్చ‌ర్య‌పోయే హెల్త్ సీక్రెట్స్‌..
అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో న్యూ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌..
స‌గ‌టున రోజుకు ఎన్ని వెంట్రుక‌లు రాల‌తాయో తెలుసా..?
చ‌క్కెర ఉప‌యోగిస్తున్నారా.. అయితే ఈ ముప్పు త‌ప్ప‌దు..
య‌మ్మీ య‌మ్మీ `ఫ్రూట్స్ కేక్‌`
తలస్నానం చేసేట‌ప్పుడు ఈ పొర‌పాట్లు చేస్తే అంతే..
క‌ళ్ల‌కు కాటుక పెట్టుకునే ముందు.. ఇవి ఖ‌చ్చితంగా తెలుసుకోండి
మైదా పిండి వాడుతున్నారా.. అయితే మీ ఆరోగ్యం..
ఎంతో సులువుగా `చేప‌ల ఫ్రై`
ఉద‌యాన్నే అర‌టిపండు తింటే ఏం అవుతుంది..?
సాఫ్ట్ వేర్ ఉద్యోగులు జ‌ర జాగ్ర‌త్త‌..
తుల‌సి ఆకుల్లో దాగున్న ఆరోగ్య ర‌హ‌స్యాలు..
ఏసీ వాడుతున్నారా.. అయితే ఈ ముప్పు త‌ప్ప‌దు..
రుచిక‌ర‌మైన `బెండ‌కాయ మ‌సాలా క‌ర్రీ`
రాగి జావతో ఎన్ని హెల్త్ సీక్రెట్సో తెలుసా..
అంద‌మైన ముఖ సౌంద‌ర్యానికి సూప‌ర్ టిప్స్‌..
కాక‌ర‌కాయ తినేముందు ఖ‌చ్చితంగా ఇవి తెలుసుకోండి..
పెర్ఫ్యూమ్స్‌కు.. డిప్రెషన్‌‌కి.. లింక్ ఏంటి..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.