స‌హ‌జంగా కొబ్బరి బొండం నుండి నేరుగా కొబ్బరి నీళ్ళు తాగడం స్వర్గతుల్యం. దీనివల్ల ఉపశాంతే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.  ఈ నీళ్లలో విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్, ఎంజైమ్‌లు, ఎమినోయాసిడ్లు, సైలోకిస్ అధికంగా ఉన్నాయి. ఈ నీళ్లు ఉపశాంతి నిచ్చే నగదు రుచికి, ఆరోగ్య ప్రయోజనాలకి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. డయేరియా తగ్గిన తర్వాత కొబ్బరి నీళ్లు చాలా ఉపయోగకరం. ఇవి నష్టపోయిన ప్ల్యూయిడ్స్‌ని భర్తీ చేస్తాయి. 


వీటిలో ఆమైనో ఆమ్లాలు, ఎంజైమ్‌లు, ఆహార పైబర్, విటమిన్‌సి పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజ సంపద పుష్కలంగా ఉంది. ఇందులో క్లోరైడ్లు, కొలెస్ట్రాల్ తక్కువ. వీటి వ‌ల్ల శ‌రీరానికి ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..


- కొబ్బరినీళ్లు వృద్ధాప్య‌ నివారణ, క్యాన్సర్ తగ్గించే కారకాలు, రక్త ప్రసరణకు ఉపయోగకరంగా ఉండే సైటో కినిన్లను కలిగి ఉంటాయని పరిశోధనలు నిరూపించాయి. 


- కొబ్బరి నీళ్లలో సెటేనియం, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వంటి కొన్ని మిశ్రమాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్‌పై పోరాటం చేస్తాయని రుజువైంది. 


-  కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నది. ఇది రక్తపోటు, గుండెపోటు ప్రమాదాలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతున్నది. 


- ఒక వ్యక్తి శరీరం ప్లూ లేదా కలిపి రెండు రకాల వైరస్‌ల బారిన పడినప్పుడు కొబ్బరి నీళ్లు వైరల్ బాక్ట్టీరియాలను అరికట్టడానికి బాగా ఉపయోపడుతాయి. 


- కొబ్బరి నీళ్లలోని ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం వల్ల మూత్ర పిండాలలోని కారాళ్ల వల్ల వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. 


- మొటిమలు, మచ్చలు, ముడుతలు, సాగిన గుర్తులు, సిల్యులైట్, తామర వంటి వాటిపై కొబ్బరి నీళ్లతో రెండు వారాలపాటు రాసి వదిలేస్తే, అది చర్మాన్ని శుభ్రపరుస్తుంది.


- కొబ్బరి బోండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్లలో దాహార్తిని తీర్చే శక్తితోపాటు అనేక లాభాలు ఉన్నాయి. కూల్‌డ్రింక్స్ తాగితే తాత్కాలికంగా దాహం తీరుతుందే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎప్పుడైనా కొబ్బరి బోండాలు సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు..  



మరింత సమాచారం తెలుసుకోండి: