స‌హ‌జంగా సీస‌న్‌కు త‌గిన‌ట్టుగా జీవ‌న శైలిని, ఆహార శైలి మారుస్తూ ఉండాలి. మండు వేసవి తరవాత వచ్చే వర్షా కాలం అంటే ఎవరికైనా ఇష్టమే. వర్షంలో తడవాలని చాలా మందికి కోరిక ఉంటుంది. మ‌రియు వ‌ర్షాకాలంలోనే ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉంటాయి. అందుకే వ‌ర్షాకాలానికి త‌గిన‌ట్టుగా మ‌నం ఆహార జాగ్ర‌త్త‌లు తీసుకుంటే అనారోగ్యం పాల‌వ‌కుండా కాపాడుకోవ‌చ్చు. అవేంటో ఇప్ప‌డు చూద్దాం..


- పాలు, పాల‌తో త‌యారు చేసిన ఇత‌ర ప‌దార్థాల‌ను స‌మ‌యానుసారం మితంగా తీసుకోండి. ఎందుకంటే పాల‌తో త‌యారు చేసిన ప‌దార్థాలు త్వ‌ర‌గా పాడ‌వుతాయి.


- పండ్ల‌ను తినే ముందే క‌ట్ చేసుకుని తినాలి. ముందుగా క‌ట్ చేయ‌డం వ‌ల్ల వాటిపై కీట‌కాలు చేర‌తాయి. 


- ఆకు కూరల‌ను వినియోగించే ముందు ఒక‌టికి నాలుగు సార్లు శుభ్రం చేయంటి. లేకుంటే ఆకుల‌పై ఉన్న కీట‌కాలు అనారోగ్యం క‌ల‌గ‌చేస్తాయి.


- వానాకాలంలో నూనె అధికంగా ఉన్న ఆహారం తీసుకోక పోవ‌డ‌మే ఆరోగ్యానికి మంచిది.


- వీధుల్లో దొరికే తినుబండ‌రాల‌కు ఈ కాలంలో దూరంగా ఉండండి.


- ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకున్న ఆహారం ఆరోగ్యానికి అస‌లు మంచిది కాదు. అది ఈ సీజ‌న్‌లో ఫ్రిజ్‌లో ఉన్న ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు అధికంగా వ‌స్తాయి.


- అధిక ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది. అలాగే ప‌చ్చిపాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చుతాయి. ఈ సీజ‌న్లో ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకుంటే మీ ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: