బ‌ఠానీల‌ను మ‌నం వెజ్ బిర్యానీ, ఆలూ కూర్మా, పన్నీర్ మసాలా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటాం. ప్రధానంగా చలికాలంలో ఇవి మార్కెట్‌లో అధికంగా లభిస్తాయి. చూడడానికి చిన్నగా ఉన్నాయి కదా అని వాటిని చిన్న చూపు చూడకండి. ఆకుప‌చ్చ‌గా, నిగ‌నిగ‌లాడుతూ క‌నిపించే బ‌ఠాణీల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వీటితో పాటు ప్రొటీన్లు కూడా ఉంటాయి. అంతేకాకుండా, చలికాలంలో ఇవి తినడం చాలా మంచిది. అందుకే, వింటర్ డైట్ కు చాలా ఫర్ ఫెక్ట్ వెజిటేబుల్.


- ప‌చ్చిబఠానీల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలీఫినోల్స్, విటమిన్ ఎ, సి మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు మరికొన్ని ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. బరువు తగ్గించడం నుండి బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేసే వరకూ అన్ని చర్యలను సహాయపడే గుణాలు పచ్చిబఠానీల్లో ఉన్నాయి. అయితే వీటిని తరచూ తీసుకోవడం వల్ల కలిగే లాభాలను ఇప్పుడు చూద్దాం.


- వంద గ్రాముల పచ్చి బఠానీలు అరగడానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఇతర కూరగాయలతో కలిపి తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు. బరువు కూడా పెరగకుండా ఉంటారు.


- పచ్చి బఠానీల్లో విటమిన్ ఎ, బి1, బి2, సిలతోపాటు ఐరన్, కాల్షియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి బఠానీలను ఉడికించి ముద్దలా చేసి ఎదుగుతున్న పిల్లలకు, బలహీనంగా ఉన్న వారికి ఇస్తే బలవర్దక ఆహారాన్ని అందించిన వారమవుతాం.


- వీటిలో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకు ఒక కప్పు మోతాదులో తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తెలిసింది. 


- యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అల్జీమర్స్, ఆర్థరైటిస్, బ్రాంకైటిస్, ఆస్టియోపోరోసిస్, క్యాండిడా వంటి రోగాలకు ఇవి బాగా పనిచేస్తాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి.


- గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. రక్తనాళాలను సంరక్షిస్తాయి. విటమిన్ కె వీటిలో కావల్సినంత దొరుకుతుంది. రోజుకు 1 కప్పు పచ్చి బఠానీలను తింటే శరీరానికి నిత్యం కావల్సిన విటమిన్ కెలో దాదాపు 44 శాతం వరకు అందుతుంది.


- శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ను నాశనం చేస్తాయి. ఇదే సమయంలో మంచి కొలెస్టరాల్ స్థాయిలను పెంచుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: