ప్రస్తుతం అందరినీ భయపెడుతున్న భూతం క్యాన్సర్. ఒకటి కాదు రెండు.. రకరకాల క్యాన్సర్ లు శరీరంలోని అన్ని భాగాలకు వస్తున్నాయి. చర్మం నుంచి కాలేయం వరకు ప్రతి అవయవానికి అటాక్ అవుతోంది క్యాన్సర్. ఇంత ప్రాణాంతకమైన క్యాన్సర్ ని ముందుగానే రాకుండా నివారించాలి. క్యాన్సర్ ఒక్కసారి అటాక్ అయిందంటే కష్టం. కాబట్టి.. ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి కాబట్టి.. ముందు జాగ్రత్తలు పాటిస్తే.. మంచిది.


మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ ని నివారించవచ్చు అనే విషయం చాలా మందికి అవగాహన ఉండదు. అందుకే.. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే.. మనం క్యాన్సర్ కి దూరంగా ఉండవచ్చో తెలుసుకుందాం..


- ఆకుకారల్లోని పోషక విలువలు డీఎన్‌ఏ డ్యామేజ్‌ కాకుండా చేస్తుంది. అలాగే ట్యూమర్లను సక్రమమైన పద్ధతిలో ఉంచుతాయి. నాన్‌ ఎంజీవో సోయా బీన్‌ క్యాన్సర్‌ కారకాలను నిర్మూలిస్తాయి. అంతేకాదు ఈస్ట్రోజన్‌ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా కంట్రోల్ లో ఉంచుతుంది.


- క్యాప్సికమ్ ఎంతో మేలు చేస్తుందట. వీటిల్లో 92 శాతం నీరు వుంటుంది. ప్రోటీన్లు, ఫ్యాట్స్ వుంటాయి. క్యాప్సికమ్ క్యాన్సర్‌కు చెక్ పెడుతుంది. అది ఏ రంగైనా సరే. గుండె సంబంధిత రోగాలను దూరం చేస్తుంది. కంటి ఆరోగ్యానికి సహకరిస్తుంది. అలసటకు చెక్ పెడుతుంది. ఇందులోని ఐరన్, క్యాల్షియం మహిళల ఆరోగ్యానికి చెక్ పెడుతుందని న్యూట్రీషియన్లు చెప్తున్నారు.


- దంచిన లేదా కత్తిరించిన వెల్లుల్లి, వంటలలో వాడటానికి ముందు 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయటం వల్ల అల్లిసిన్ అనే ఫైటోకెమికల్ తయారవుతుంది. ఇది అనేక రకాల వ్యాధులను కలిగించే కారకాలకు వ్యతిరేఖంగా పని చేస్తుంది.


- ఎక్కువ ఉష్ణోగ్రతలలో వండటం వలన డీఎన్ఏలను ప్రమాదానికి గురి చేసే సమ్మేళనాలను మాంసం విడుదల చేస్తుంది. దీని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికమవుతాయి. బొగ్గులపైన వండిన మాంసం లేదా ఉడకబెట్టిన మాంసం తినడం మంచిది.


- నిమ్మ, కమలా వంటి విటమిన్ సి ఉండే.. పండ్లు తీసుకోవడం మంచిది. ఇవి క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. అలాగే విటమిన్‌‌ డి, విటమిన్‌ ఈ ఉండే ఆహార పదార్థాలు కూడా క్యాన్సర్‌ రాకుండా నివారిస్తాయి.


- హెర్బల్స్ ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కాబట్టే వీటిని వ్యాధులను తగ్గించటానికి వాడతారు. రోజ్మేరీ వంటివి క్యాన్సర్ కారకాలకు వ్యతిరేఖంగా పని చేస్తాయి. రోజ్మేరీ కార్న్ జోల్ అనే పదార్థాన్ని కలిగి ఉండి, క్యాన్సర్ ను పెంచే కారకాలకు వ్యతిరేఖంగా పనిచేస్తుంది.


- టమోటాలలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి వివిధ రకాల క్యాన్సర్ లను కలుగచేసే కారకాలకు వ్యతిరేఖంగా పని చేస్తాయి. కాబట్టి వీటిని వంటకాల్లో వాడటం వల్ల క్యాన్సర్ కి దూరంగా ఉండవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: