ద్రాక్షలో ఎక్కువగా యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో ద్రాక్షలో ఉండే ఫైటో ట్యూట్రియెంట్స్ బాగా పని చేస్తాయి. అలాగే గుండె ఆరోగ్యంగా ఉండడానికి ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. పాలీఫెనోల్స్, రెవెవర్ట్రాల్ కూడా ద్రాక్షలో అధికంగా ఉంటాయి. ద్రాక్షలో ఉండే గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, రోజు గుప్పెడు తింటే చాలా మేలు కలుగుతుంది. చాలా రకాల ప్రయోజనాలున్నాయి. మరి అవి ఏమిటో చూడండి.


- మెదడుకు సంబంధించిన నరాలు బాగా పని చేసేందుకు ద్రాక్ష బాగా పని చేస్తుంది. మతిమరుపును పోగొడుతుంది. మెదడు బాగా పని చేసేలా చేయించే గుణాలు ద్రాక్ష బాగా పని చేస్తుంది.


- మోకాలి నొప్పితో బాధపడేవారు ద్రాక్ష తింటే మంచిది. ఆస్టియో ఆర్థరైటిస్ వంటి వాటిని కూడా ద్రాక్ష పోగొడుతుంది. ద్రాక్షలో ఉండే పాలీఫెనోల్స్ కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.


- ద్రాక్షలో యాంటీ ఇన్ఫ్ల‌మేటరీ గుణాలుంటాయి. ధమనులకు ఉపశమనం కలిగించగలదు. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేయగల ప్రత్యేక గుణాలు ద్రాక్షలో ఉంటాయి.


- ద్రాక్ష కళ్లకు చాలా మంచిది. మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. మెదడు ప్రతిస్పందనలను వేగవంతం చేసే గుణం ద్రాక్షకు ఉంటుంది. 


- ద్రాక్షలో పోషటాషియం ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు పొటాషియం తోడ్పడుతుంది. అలాగే నడుము దగ్గర ఉండే కొవ్వును పొటాషియం తగ్గించగలదు.


- ద్రాక్షలో ఆస్త్మాను నయం చేసే సామర్థ్యం కలిగిన లక్షణాలు చాలా ఉన్నాయి. ఆస్త్మాతో బాధపడేవారు ఎండు ద్రాక్ష తినడం వల్ల ఆస్త్మాను తగ్గించుకోవచ్చు.


- ద్రాక్షలో ఉండే రెస్వెట్రాల్ వృద్ధాప్య ఛాయల్ని తొలగిస్తాయి. చర్మ సమస్యలు పోతాయి. మొటిమలు తగ్గుతాయి. చర్మం సున్నితంగా కాంతివంగా ఉండేలా చేసే గుణాలు ద్రాక్షలో ఎక్కువగా ఉంటాయి.


- బ్లాక్ గ్రేప్స్ వ‌ల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్ లను అరికట్టడంలో తమ వంతు పాత్ర పోషిస్తాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: