పెరుగుతున్న వయస్సుని దాచాలాని చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకు ఆహారంలో మార్పుల దగ్గర నుంచి  జిమ్‌లో కసరత్తుల వరకు ప్రతిఒక్కటి క్రమం తప్పకుండా చేస్తుంటారు. అయితే.. వయసు దాచాలని కోరుకునేవారు పెసలు తినండని చెబుతున్నారు. పోషకాహార నిపుణులు. పోషకాలు ఎక్కువగా ఉన్న పెసర్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. పెసళ్లలో విటమిన్స్, ప్రోటీనులు అధికంగా మరియు లోకార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఉడికించిన వాటిలో 100 క్యాలరీలకంటే తక్కువగా ఉంటాయి. పెసర్లని మామూలుగా కంటే మొలకల్లా చేసి తినడం వల్ల అదనపు ఆరోగ్య ప్రయోజనాలు..


- ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పెసలని తినడం వల్ల ఒంట్లోని కొవ్వు శాతం తగ్గుతంది. ఈకారణంగా గుండె సమస్యలు దరిచేరవు.


- పెసలులో ఉండే పుష్కలమైనటువంటి ప్రోటీనులు మరియు న్యూట్రీషియన్స్ ఆరోగ్యకరమైన జుట్టు పొందడానికి సహాయపడుతాయి.


- కాపర్ కూడా అధికంగా ఉండే పెసలను తినడం ద్వారా చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.


- వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది. ఒంటికి బలం చేకూరుతుంది.


- పెసలు అధికంగా ఉండే బ్లడ్‌ ప్రెషర్‌ను తగ్గిస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.అందుకు పెసల్లో ఉండే సోడియం గ్రేట్ గా సహాయపడుతుంది. 


- పెసలు తినడం వల్ల డయాబెటిస్ కంట్రోల్‌‌లో ఉంటుంది.


- లివర్, వెంట్రుకలు, గోళ్లు, కళ్లు, గుండె ఇలా శరీరభాగాలను సంరక్షించడంలో పెసలు అద్భుతంగా పనిచేస్తాయి.
‍‍‍
- పెసలకి కెమికల్స్‌ని నాశనం చేసే గుణం ఉంటుంది. ఈ కారణంగా వీటిని మెనూలో భాగం చేసుకోవడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: