స‌హ‌జంగా క‌డ‌పునొప్పితో బాధ‌ప‌డేవారు యాస్ప్రిన్‌, నొప్పిబిళ్లల వంటివి ఎక్కువగా వాడడం వల్ల పొట్టలో గోడలు, పొర దెబ్బతింటాయి. ఖాళీ కడుపుతో కాఫీ, టీలు, నిమ్మరసం తాగినా, వేడి పదార్థాలు తిన్నా కొంత మందికి క‌డుపులో మంట వ‌స్తోంది. రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ ఎక్కువైనా తీవ్ర గ్యాస్ట్రైటిస్‌ సమస్య తలెత్తుతుంది. దీంతో బాధపడేవారికి ఆకలి ఉండదు. బ్రేక్‌ఫాస్ట్‌ చేయరు. వాంతులు అవుతాయి. ఇంట్లో ఉండే ప‌లు ప‌దార్థాల‌తోనే ఆ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు. మ‌రి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందామా..! 


- ఒక టేబుల్ స్పూన్ తేనె, 3/4 టీస్పూన్ల దాల్చిన చెక్క పొడిని భోజ‌నం త‌రువాత తీసుకుంటే గ్యాస్‌, క‌డుపులో మంట వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. 


- ఉదయమే ఖాళీ కడుపుతో గోరువెచ్చటి నీళ్లల్లో రెండు టేబుల్‌స్పూన్ల తేనె వేసుకుని తాగితే ఎసిడిటీ తగ్గుతుంది. 


- బొప్పాయి గింజల పొడిని, పైనాపిల్‌ ముక్కలపై చల్లుకుని రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపున తింటే సాంత్వన లభిస్తుంది.


- ఆకుపచ్చని యాలకులు, సోంపు గింజలు, దాల్చినచెక్కలను సమపాళ్లలో తీసుకుని పాన్‌లో నూనె లేకుండా 30సెకన్లు వేగించి మెత్తటి పొడిలా చేయాలి. ఈ పొడిని భోజనంతో పాటు అర టీస్పూను తినాలి.


- ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో 1 టీస్పూన్ బేకింగ్ సోడాను వేసి పూర్తిగా క‌లిసేంత వ‌ర‌కు క‌లియ‌తిప్పాలి. అనంత‌రం ఆ ద్ర‌వాన్ని తాగితే గ్యాస్‌, క‌డుపులో మంట వంటి స‌మ‌స్య‌లు పోతాయి. 


- కొవ్వు లేని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో 1 టీ స్పూన్ తేనెను క‌లిపి త‌ర‌చూ తీసుకుంటే గ్యాస్ స‌మ‌స్య‌లు పోతాయి. 


-  రెండు టేబుల్ స్పూన్ల తేనె, యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ల‌ను ఒక క‌ప్పు నీటిలో బాగా క‌లిపి ఆ ద్ర‌వాన్ని స‌మ‌స్య ఉన్న‌ప్పుడు తీసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: