ఉరుకుల పరుగుల జీవితంలో అందరి దృష్టి సంపాదన వైపే,ఆరోగ్యం గురించి కాస్త ఆగి ఆలోచించే సమయం, ఓపిక ఎవరి దగ్గర లేవు అంటారు ఇప్పుడున్న ఉద్యోగులు. అందుకే చిన్న వయసులో కూడా పెద్ద వారిలా కనిపిస్తుంటారు. ముఖ్యంగా బరువు విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడమే మానేశారు చాలా మంది. అయితే అనవసరంగా బరువు పెరగడం అంత మంచిది కాదు అంటున్నారు వైద్య నిపుణులు.

అధిక బరువు పెరగడం వల్ల ఆరోగ్య చాలా త్వరగా పాడైపోతుందని. సన్నగా ఉన్నవారితో పోల్చుకుంటే ఉభకాయుల్లో గుండె నొప్పి వచ్చే అవకాశాలు అధికం అని వైద్యులు చెప్తున్నారు. బరువు అనేది రోగం కాకపోవచ్చు కానీ అన్ని రోగాలకు బరువే కారణం.

అయితే బరువు పెరగడం వల్ల కేవలం ఆరోగ్యం క్షిణించడమే కాదు లావు ఉన్నవారు చనిపోయాక స్వర్గానికి కూడా వెల్లరంట అని ఓ మత గురువు చెప్పాడు.బ్రెజిల్ లోని సోవాపోలో అనే ప్రాంతంలో కొంతమంది మతగురువులు ఇలాగే బోధనలు చేస్తున్నారు... లావుగా ఉన్నవారు స్వర్గానికి వెళ్ళలేరని ఓ మత గురువు పేర్కొన్నాడు. వెంటనే కింది వరసలో ఉన్న ఓ లావుపాటి మహిళ పరిగెత్తుకుంటూ వచ్చి మత గురువును ఒక్క తోపు తీసింది.దాంతో మత గురువు కిందపడిపోయారు,వెంటనే అక్కడి సిబ్బంది వచ్చి ఆ మహిళని అడ్డుకున్నారు. ఈ సంఘటనలో మత గురువుకు స్వల్ప గాయాలు అయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: