ఒకప్పుడు ఉన్న కాలం, వాతావరణం ఇప్పుడు లేవు, అప్పట్లో ముసలి తనం లో కూడా మనుషులు చాలా బలంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు వయసుతో సంబంధం లేకుండా వింత వింత ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. చిన్నపిల్లలకు కూడా షుగర్, బీపీలు వస్తున్నాయి.

30ఏళ్లకే గుండె పోటు కూడా వస్తుంది అంటే మనం ఎటువంటి పరిస్థితులలో బ్రతుకుతున్నామో ఆలోచించాలి. మన ఆహారపు అలవాట్లు కూడా ఇందుకు ముఖ్య కారణం.రోజు సరిగా తినక పోవడం, వ్యాయామాలు చేయకపోవడం,వత్తిడిలో జీవనాన్ని సాగించడం వల్లే ఇవన్నీ జాతుగుతున్నాయి.

చిన్న పిల్లల్లో కూడా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా తలెతున్నాయి. ముఖ్యంగా కంటి సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి.కంటి సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలనంటే ఆహారం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రతి రోజు 6 నుండి 7 బాదం పప్పులను రాత్రి నీటిలో నానబెట్టి..ఉదయాన్నే పొట్టుతీసి తినాలి.వీటిలో ఉండే ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ E కంటి సమస్యను దూరం చేస్తాయి.ఉసిరిలో విటమిన్ C ఉంటుంది. కంటి రెటీనా ఉత్పత్తికి ఇది ఉపయోగ పడుతుంది. క్యారెట్,ఆపిల్,పాలకూర, బీట్రూట్,కోడిగుడ్లు కూడా తరచు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: