దేశంలో చాలా మందిని కలవరపరుస్తున్న వాటిలో అధిక బరువు. అయితే అదనపు బరువు అనేది మనం రోజు తీసుకునే ఆహారం మీదే ముడిపడి ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. ఒత్తిడి వల్ల అతిగా తినడం కూడా అధిక బరువుకు దారి తీస్తోంది. ఆకట్టుకునే ప్రచార ధోరణికి అలవాటు పడిన సమాజం అధిక కొవ్వు పదార్థాలు ఉండే, స్వీట్లు, బర్గర్‌, పిజ్జాలకు బాగా అలవాటైపోయారు. సరైన వ్యాయమం లేకపోవడం, చాలాసేపు కూర్చోనే పని చేయడం కూడా బరువుకు కారణం అవుతోంది.

తీరా పెరిగిన బరువును తగ్గించుకునేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. అయితే, బరువు తగ్గే మార్గాలు లేకపోలేదు. ప్రాచీన కాలం నుంచే అందుబాటులో ఉన్న పప్పు ధాన్యాలు, చిక్కుళ్లలో ప్రొటీన్‌ పాళ్లు పుష్కలంగా ఉండి బరువు సమస్యను తగ్గిస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.

ముఖ్యంగాసోయాబీన్స్‌, చిక్కుడు, శనగలు, బఠానీ, వంటివి బరువును తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిని తీసుకుని బరువును తేలిగ్గా వదిలించుకోవచ్చు. శనగల్లో ప్రొటీన్‌, ఫైబర్‌లు మెండుగా ఉండి బరువు తగ్గేందుకు దోహదపడుతుందని ఇటీవలే అమెరికాకు చెందిన,ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ సంస్థ ఒక సర్వేలో వెల్లడించింది.

1, ఉదాహరణకు ఉడకబెట్టిన 100గ్రాముల శనగల్లో 9గ్రా ప్రొటీన్స్‌,8గ్రా ఫైబర్‌, 2.6గ్రా ఫ్యాట్‌, ఐరన్‌లు ఉంటాయని నివేదికలో తెలిపింది.
 2, నిత్యం ఆహారంలో శనగలు తీసుకుంటే వీటిలో ఉండే ప్రొటీన్‌, ఫైబర్‌ కొద్ది రోజుల్లోనే బరువును తగ్గిస్తాయి.
3, బరువు తగ్గడంతో పాటు, బ్లడ్‌ లెవల్‌, షుగర్‌ పాళ్లను కంట్రోల్‌లో ఉంచేందుకు దోహదపడుతుంది. అని ఆ అధ్యయనం చెబుతోంది.
ఇంకెందుకు ఆలస్యం వెంటనే శనగలు తినండి, అధిక బరువును తగ్గించుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: