తలనొప్పి అనేది చాలా సాధరణ ఆరోగ్య సమస్య. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని ఏజ్ గ్రూప్ ల వారు అప్పుడప్పుడు లేదా ఏదో ఒక సందర్భంలో తలనొప్పిక గురి అవుతుంటారు.  ఒత్తిడి, మానసిక సమస్యలు, ఆందోళన.. వంటి అనేక కారణాల వల్ల మనకు అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంటుంది. దీంతో ఏ పని చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నొప్పి తగ్గకపోతే అవస్థ మరింత ఎక్కువవుతుంది. 


తలనొప్పిని నివారించుకోవడం కోసం మార్కెట్లో మెడికల్ ఫార్మసీలో వివిధ రకాల మందులు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే, ఇటువంటి రసాయనిక మందులకు ఎల్లప్పుడూ అలవాటు పడటం మంచిది కాదు. అయితే ఎలాంటి తలనొప్పినైనా మన ఇంట్లో సహజసిద్ధంగా లభించే పదార్థాలతోనే తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..


- కొబ్బరి నూనె వేడిని తగ్గిస్తుంది. కొబ్బరి నూనెను నుదుటిపై 15 నుంచి 20 నిమిషాల పాటు మసాజ్‌ చేసి చూడండి.. తలనొప్పి త‌గ్గుతుంది.


- బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు జీడిపప్పు, పిస్తా, బాదంపప్పులను తింటే వెంటనే తలనొప్పి తగ్గుతుంది. ఇవి పెయిన్ కిల్లర్స్‌గా పనిచేస్తాయి. 


- తలనొప్పి బాగా ఉంటే బయటకు వెళ్లి స్వచ్ఛమైన గాలిని కొంత సేపు పీల్చుకోండి. కొద్ది సేపు వాకింగ్ చేయండి. వెంటనే నొప్పి తగ్గుతుంది. 


- ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక టీస్పూన్ అల్లం రసం కలుపుకుని తాగినా తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. 


- ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. 


- కొన్ని సార్లు మన శరీరంలో నీరు తక్కువైనా తలనొప్పి వస్తుంది. కనుక నీటిని బాగా తాగాలి. దీంతో తలనొప్పి తగ్గుతుంది.


-  యాపిల్‌ పండుతో పాటు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తీసుకున్నా తలనొప్పి మటుమాయం అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: