ఈరోజుల్లో జ్వరం వచ్చినట్టుగా, తలనొప్పి వచ్చినంత ఈజీగా క్యాన్సర్ వస్తోంది.  తీసుకున్న ఆహారంలో మార్పుల వలన, మనిషి మనుగడలో మార్పుల వలన, ఒత్తిడితో పనిచేయడం వలన ఇలాంటి క్యాన్సర్ వస్తున్నది.  రీసెంట్ సర్వే ప్రకారం పల్లెటూరిలో కంటే పట్టణాల్లో ఉండే వ్యక్తులు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు.  శరీరానికి తగిన వ్యాయామం వంటివి లేకపోవడం వలన కూడా క్యాన్సర్ వస్తుంది.  


నిత్యం ఎక్కువగా కూర్చొని పనిచేసేవాళ్లకు త్వరగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్టు రీసెంట్ రీసెర్చ్ తెలియజేస్తోంది.  ఒత్తిడి నుంచి బయటపడేందుకు నిత్యం తప్పకుండా కొంతసమయం పాటు వ్యాయామం, యోగ, ధ్యానం వంటివి చేయాలి.  అలా చేస్తేనే ఆరోగ్యం కుదురుగా ఉంటుంది.  తీసుకునే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.  


ఆహారంలో మార్పులు చేయడం చాలా అవసరం.  తీసుకునే ఆహారంలో తప్పకుండా చేపలు ఉండే విధంగా చూసుకోవాలి.  వారంతో కనీసం రెండు రోజులు చేపలు తీసుకోవాలి.  అలా చేపలు తీసుకుంటే.. శరీరానికి కావాల్సిన ఒమేగా 3 ప్రోటీన్ అందుతుంది.  ఈ ప్రోటీన్ శరీరానికి చాలా అవసరం.  శరీర నిర్మాణంలో ఒమేగా 3 ఆమ్లాలు ప్రముఖపాత్ర పోషిస్తాయి.  


ఒమేగా 3 లోని ప్రోటీన్ క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తిని కలిగి ఉంటాయి.  అందుకే చేపలు తప్పనిసరిగా వారానికి రెండుసార్లు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  రీసెంట్ స్టడీస్ కూడా ఇవే తెలిజేస్తున్నాయి.  చేపల్లో ఇవే కాకుండా శరీరానికి కావాల్సిన ఇతర పోషకాలు కూడా ఉన్నాయి.  ఇవి మెదడును చురుగ్గా ఉంచేందుకు సహకరిస్తాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: