అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక వైద్య సేవలను అందించే నిజామ్ వైద్య విజ్ఞాన సంస్థ(నిమ్స్)  ప్రతిష్ట దిగజారిపోతోంది. రోగులకు సకాలంలో  సేవలను అందించడంలో యాజమాన్యం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శ పాలకపక్షంలో వ్యక్తమవుతుంది. ఈ పరిణామాలను పట్టించుకోవాల్సిన ఉన్నతిధికారులు చోద్యం చూస్తున్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చివరికి ఆర్థిక కష్టాలతో సతమతమవుతూ విశ్రాంతి ఉద్యోగులకు పెనషన్లు సైతం  చెల్లించలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రి కార్యనిర్వాహక అధికారుల వైఖరికి ప్రస్తుతం అందుతున్న వైద్య సేల తీరు దర్పణం పడుతుంది.వాస్తవానికి ఎయిమ్స్ స్థాయి కలిగిన నిమ్స్ ఆసుపత్రి తెలంగాణ రాష్టానికే తలమానికంగా నిలుస్తోంది. ఒకప్పుడు దేశంలోనే  అరుదు అయిన వైద్య సేవలు అందించి ఖండాంతర ఖ్యాతిని సంపాదించుకుంది. ఈ తరహా వైద్య సేవలు ఇప్పటికీ ఈ  ఆసుపత్రి అందిస్తుందనే చెప్పాలి. కానీ  అలాంటి  ఆసుపత్రి పరిపాలం లోపం,ఆర్థిక సమస్యలు,ఉద్యోగుల కొరత తో తన ప్రతిష్టను కోల్పోవాల్సి వస్తుంది. 


విశ్వనగరంలోని నిమ్స్ ఆసుపత్రి,నేడు అడుగు అడుగున  సమస్యలతో రోగులకు కనీస వైద్య సేవలు అందించలేని స్థాయి కి దిగజారింది,కనీసం ఆపరేషన్లు చేసే వైద్యుని కి చేతులకి తొడిగే  గ్లవిసులు సైతం సకాలంలో సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది,విశాలమైన ఈ ఆసుపత్రిలో ఎక్కడ చూసినా రోగులు వైద్యం కోసం బారులు తీరి కనిపిస్తుంటారు,కనీసం వారిని పట్టించుకొనే నాధుడు కరయ్యాడు. రోగులకు అందుతున్న సేవలపై పర్యవేక్షణ చేయాల్సిన నిమ్స్ ఉన్నతాధికారి ఎక్కువ సమయాన్ని సచివాలయానికి పరిమితమవుతున్నాడని ఉద్యోగవర్గాలు సైతం గుసగుసలాడుతున్నారు. కనీసం ఆసుపత్రిలో రౌండ్స్ కి కూడా వెళ్ళకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం,ఇక ఇతని కింద పర్యవేక్షణ బాధ్యతలు మోస్తున్న ఒకరిద్దరు అధికారులు లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు తప్ప నిమ్స్ లో రోగుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు, ఆ అధికారులు సైతం పెద్దయాన్ని అదర్శనంగా తీసుకొని కాబోలు వారు తమ వ్యక్తిగత పనుల్లో బిజీగా వుంటున్నారు.


 నిమ్స్ లో అనేక సమస్యలు ఎక్కడిక్కడే పరిష్కారం కాకుండా రోగులను ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికి గత 6 నెలల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పదవి విరమణ పొందారు. దాంతో అరకొరగా ఉన్న ఉద్యోగులకు పని భారం విపరీతంగా పెరుగుతుంది. వైద్యులు సైతం ఫెస్సి కార్మికులపై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాల క్రమంలో కనీసం రక్త పరీక్షల కోసం ఉపయోగించే శ్యాంపిల్ బాటిళ్ళపై రాసే పెన్నుల కొరత ఏర్పడింది. వాటిని కూడా సరఫరా చేసే పరిస్థితులు అడుగంటిపోయాయి. ఈ దుస్థితికి కారణం చిత్తశుద్ధి లేని పాలకవర్గమే. పరిపాలన లోప బోయిష్టమేనని అని కచ్చితంగా చెప్పవచ్చు. ప్రస్తుతం నిమ్స్ ఎదుర్కొంటున్న పరిస్థితులపై వివరణ కోరేందుకు ప్రయత్నిస్తే...నిమ్స్ సంచాలకులు డా. కె. మనోహర్  స్పందించకపోవడం గమనార్హం.


అదేమంటే సార్ అసలు మీడియాతో మాట్లాడరని ఆయన పేషీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా స్వయం ప్రతిపర్తి కలిగిన నిమ్స్ కు సంచాలకులుగా వ్యవహరిస్తున్న డా. కె. మనోహరి మరో పర్యాయం తన పదవి కాలాన్ని పొడిగింపచేసుకునే ప్రయత్నం లో తలమునకలై ఉన్నట్టు సమాచారం. సెప్టెంబరు లో ఆయన పదవి కాలం ముగియపోతుఃది. ఇప్పటికే రెండు పర్యాయాలుగా మనోహర్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. కాగా ఈ పదవిని వారిలో ఏకంగా 13 మంది వైద్య ప్రముఖులు ఉండగా.. వారంతా తమతమ స్థాయిలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.  ఈ పరిస్థితుల్లో నిమ్స్ ని గాడిలో పెట్టకలిగే సమర్థవంతమైన వ్యక్తిని డైరెక్టర్ గా నియమించాలని ఉద్యోగులు , రోగులు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: