స‌హ‌జంగా కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే మ‌న శ‌రీరానికి క‌వాల్సిన ఎన్నో పోష‌కాలు అందుతాయి. డీ హైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు చాలా మంది కొబ్బరినీళ్లు తాగుతాయి. ఆ సీజ‌న్‌.. ఈ సీజ‌న్ అని లేకుండా కొబ్బ‌రి నీరు తాగ‌వ‌చ్చు. అయితే కొబ్బ‌రి నీళ్లు మ‌రియు నిమ్మరసం క‌లిపి తాగితే ఆరోగ్యానికి మ‌రింత‌ మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్ళ కమ్మని రుచికి, నిమ్మ ఫ్లేవర్ జోడిస్తే అద్భుతమైన డ్రింక్ తయారవ్వడమే కాదు, ఇందులో అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..


- కొబ్బరి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల డీహైడ్రేషన్ కు గురైన వానిరి బాగా ఉపయోగకరం. ఇది ఇన్ స్టాంట్ ఎనర్జీని అంద‌జేస్తుంది.


- కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రోలైట్స్‌ అధికంగా ఉంటాయి. లేత కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్‌ తక్కువగా ఉంటాయి. వీటిలో కొవ్వులు ఏమాత్రం ఉండవు. అలాంటి కొబ్బరినీళ్లలో కాస్త నిమ్మరసం కలుపుకుని తాగితే మరిన్ని ప్రయోజనాలుంటాయి. 


- గర్భణి మహిళలకు, చిన్న పిల్ల‌ల‌కు నిమ్మరసంతో కొబ్బరి నీరు క‌లిపి ఇవ్వాలి. ఇలా ఇవ్వ‌డం వ‌ల్ల వాంతులతో బాధపడుతున్న వారికి  వాంతులు తగ్గిపోతాయి.


- కొబ్బరినీటిలో పొటాషియం, క్లోరిన్ పుష్క‌లంగా ఉంటాయి. ఇందులే ఉండే అల్బుమిన్, నిమ్మరసంలో ఉండే ఎసిడిక్ నేచర్ రెండు కలవడం వల్ల మూత్ర‌పిండ వ్యాధుల‌కు చెక్ పెడుతుంది.


- బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి కొబ్బ‌రి నీళ్లు మ‌రియు నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మంచి రిజ‌ల్ట్ క‌నిపిస్తుంది. 


- కొబ్బ‌రి నీళ్లు, నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల అజీర్ణ స‌మ‌స్య‌ల‌ను తొల‌గిస్తుంది. జీర్ణ వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌డేలా చేస్తుంది.


- కొబ్బ‌రి నీళ్లు మ‌రియు నిమ్మర‌సం తీసుకోవ‌డం సౌంద‌ర్య స‌మ‌స్య‌లకు కూడా బాగా ప‌నిచేస్తుంది. 


ఇలా పెద్ద‌ల‌కు, పిల్లల‌కు ఈ రెండిటి కాండినేష‌న్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉండే వ్యాధినిరోధకతను పెంచుతాయి. కొబ్బ‌రి నీళ్ల‌లో ఉండే పోష‌కాలు ఆరోగ్య‌న్ని మెరుగుప‌రుస్తుంది. ఈ రెండు క‌లిపి తీసుకోవ‌డం మ‌రింత ఆరోగ్య‌క‌రం.  



మరింత సమాచారం తెలుసుకోండి: