పాల‌లో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. ప్ర‌తి ఒక్క‌రూ పాలు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి పోష‌కాలు ల‌భిస్తుంది. పాల పాల‌లో ఉండే కాల్షియం, పాస్పరస్, విటమిన్ 'D' వంటి అని రకాల పోషకాలు శరీరానికి అంద‌డం వ‌ల్ల అందం.. ఆరోగ్యం కూడా. చ‌ర్య సౌంద‌ర్యాల‌కు కూడా పాలు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే మనం తాగే పాలు మ‌రియు పాల‌తో చేసిన ఉత్ప‌త్తులు ఎక్కువ శాతం ప్రాసెస్ చేసిన‌వే. బ‌య‌ట టీ స్టాల్స్ ఉప‌యోగించేవి కూడా ప్రాసెస్ చేసినవే. వీటి వ‌ల్ల శ‌రీరానికి చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. 


అలాగే మ‌నం రోజు వాడే ప్యాకెట్ పాల‌ను ఎక్కువ‌గా పాల పొడితో త‌యారు చేస్తారు. ఈ పాల పొడిలో ఒత్తిడితో ఒక చిన్న రంధ్రం లోంచి పాలను గాలిలోకి స్ప్రే చేయడం ద్వారా పాలపొడి త‌యారు చేస్తారు. అయితే అందులో ఉన్న కొవ్వు గాలిలోని నైట్రేట్స్‌ను కలుపుకుని ఆక్సిడైజ్ అవుతుంది. ఈ ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్ వ‌ల్ల గుండె జ‌బ్బులు, ర‌క్త‌నాళాల జ‌బ్బుల‌కు గుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.


స‌హ‌జంగా మ‌నం స్వ‌చ్ఛ‌మైన పాలు తీసుకోవ‌డం వ‌ల్ల గుండెకు, మ‌రియు అనేక ర‌కాల జ‌బ్బుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం అందిస్తుంది. తక్కువ స్థాయిలో లేదా కొవ్వు పదార్థాలు లేని పాలను తాగటం వలన టైప్-2 మధుమేహం కలిగే అవకాశాలను పూర్తిగా తగ్గిస్తుంది. అయితే ప్యాకెట్ పాలు తీసుకోవ‌డం వ‌ల్ల చాలా ప్ర‌మాదాలు ఉన్నాయ‌ని నిపుణులు హెచ్చ‌నిస్తున్నారు. ప్యాకెట్ పాలు వ‌ల్ల జీర్ణకోశ వ్యాధులు మ‌రియు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: